Rohit Sharma Leadership: రోహిత్ శర్మ కెప్టెన్ కాదు హి ఈజ్ లీడర్. నిజమే కెప్టెన్ గా రోహిత్ (Rohit Sharma) టీమిండియాకు చాలానే చేశాడు. ఆటగాడిగా జట్టుకు తాను చేసిన కృషి ఎప్పటికి మర్చిపోలేం. జట్టు ఒత్తిడిలో ఉన్నప్పుడు రోహిత్ విధ్వంసం ఆటగాళ్లకు ధైర్యాన్నిస్తుంది. ఒకవైపు ఆటతీరుతో ఆకట్టుకుంటూ మరోవైపు జట్టును ముందుకు నడిపించడంలోనూ రోహిత్ సక్సెస్ అయ్యాడు. ప్రస్తుతం రోహిత్ టీమిండియాకు పెద్దన్న పాత్ర పోషిస్తున్నాడు. దీంతో రోహిత్ ని కెప్టెన్ గా మాత్రమే చూడలేం. ఆయనో లీడర్ కూడా.
రోహిత్ లీడర్షిప్ పై తాజాగా పీయూష్ చాలా గొప్పగా మాట్లాడాడు. రోహిత్ శర్మ కెప్టెన్ కాదు లీడర్ అన్నాడు. 2023 వన్డే ప్రపంచ కప్ , 2024 టి20ప్రపంచ కప్ రోహిత్ నాయకత్వం అద్భుతంగా ఉందన్నాడు. ఈ రెండు మెగా టోర్నీలో రోహిత్ బ్యాటింగ్ చేసిన విధానాన్ని లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌తో పోల్చారు. తోటి ఆటగాళ్లపై ఒత్తిడిని తగ్గించడానికి బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటాడని చెప్పాడు. ఒకరోజు అర్ధరాత్రి రెండున్నర గంటలకు రోహిత్ పీయూష్ కు మెసేజ్ చేసి డేవిడ్ వార్నార్ ని ఎలా అవుట్ చేయాలో ప్లాన్ చెప్పినట్లు తాజాగా పీయూష్ గుర్తు చేసుకున్నాడు. అంతేకాదు ఓ కాగితంపై ఫీల్డ్‌ను కూడా గీశాడట. ఆ సమయంలో రోహిత్ నిజమైన నాయకుడిగా కనిపించాడని పీయూష్ చావ్లా అన్నాడు. కాగా రోహిత్ పై పీయూష్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.
2023 ఐపీఎల్ సీజన్‌లో ముంబై ఇండియన్స్ తరఫున పీయూష్ చావ్లా అద్భుత ప్రదర్శన చేశాడు. 16 మ్యాచ్‌లు ఆడి 22 వికెట్లు తీశాడు. అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు ఐపీఎల్‌లో రోహిత్ శర్మతో కలిసి పీయూష్ చావ్లా ఆడాడు. 2007 టీ20 ప్రపంచ కప్, 2011 వన్డే ప్రపంచ కప్ గెలిచిన భారత జట్టులో చావ్లా కూడా ఉన్నాడు.
Also Read: Team India Unlucky Players: టీమిండియాలో దురదృష్టానికి కేరాఫ్ వాళ్లిద్దరే