8th Continent : ఖండాలు ఎన్ని ? అనే దానికి ఆన్సర్ 7 !! ఇప్పుడు ఎనిమిదో ఖండం కూడా ఈ లిస్టులో చేరింది. అదే.. ‘జీలాండియా’ !! దీన్ని ‘టె రీ-ఆ-మౌ’ (Riu-a-Maui) అని కూడా పిలుస్తున్నారు. ఈ నూతన ఖండపు మ్యాప్ ను రూపొందించారని Phys.org ఒక న్యూస్ రిపోర్ట్ ను పబ్లిష్ చేసింది. సముద్ర భూగర్భం నుంచి సేకరించిన రాతి నమూనాల ఆధారంగా శాస్త్రవేత్తలు ఈ 8వ ఖండాన్ని గుర్తించినట్టు తెలిపింది. ఈ అధ్యయనానికి సంబంధించిన వివరాలు ‘టెక్టోనిక్స్’ అనే జర్నల్లో పబ్లిష్ అయ్యాయి. దాదాపు 375 సంవత్సరాలుగా కనిపించకుండా దాగి ఉన్న ఈ 8వ ఖండాన్ని ఇప్పుడు గుర్తించారని నివేదిక పేర్కొంది.
Also read : Chandrababu Brand : ఏపీపై భారీ కుట్ర? రాష్ట్రానికి సంకెళ్లు.!
జియాలజిస్టులు, సెస్మాలజిస్టులతో కూడిన నిపుణుల టీమ్ ఈ కొత్త ఖండానికి సంబంధించిన మ్యాప్ ను రెడీ చేసిందని Phys.org చెప్పింది. జీలాండియా విస్తీర్ణం 1.89 మిలియన్ చదరపు మైళ్లు ఉందని, ఈ సైజు మడగాస్కర్ కంటే ఆరు రెట్లు పెద్దదని వివరించింది. ‘జీలాండియా’ ఖండంలో దాదాపు 94 శాతం నీటి అడుగు భాగానే ఉందని తెలిపింది. న్యూజిలాండ్ మాదిరిగా కేవలం కొన్ని ద్వీపాలు మాత్రమే పైకి కనిపిస్తున్నాయని శాస్త్రవేత్తలు విశ్లేషించారు. జీలాండియా వాస్తవానికి పురాతన సూపర్ ఖండమైన గోండ్వానాలో భాగంగా ఉందని అధ్యయనకారులు చెబుతున్నారు. గోండ్వానా సుమారు 550 మిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడిందని శాస్త్రవేత్తలు (8th Continent) తెలిపారు.