YouTube Vs Ad Blockers : యూట్యూబ్ వీడియోల మధ్య వచ్చే యాడ్స్‌ను చూడకుండా ఉండేందుకు చాలామంది యాడ్ బ్లాకర్లను వాడుతుంటారు. దీన్ని ఆపేందుకుగానూ.. యాడ్ బ్లాకర్లను వాడే యూజర్లకు గత నెలరోజులుగా యూట్యూబ్ వరుసపెట్టి నోటిఫికేషన్లను పంపుతోంది. యాడ్ బ్లాకర్‌ను డీయాక్టివేట్ చేస్తేనే.. వీడియో ప్లే అవుతుందని స్పష్టం చేస్తోంది. అయితే కొంతమంది యూజర్లు యూట్యూబ్ వార్నింగ్ నోటిఫికేషన్ రాగానే ‘యాడ్ బ్లాకర్’ను డీయాక్టివేట్ చేసి.. వీడియో ప్లే కావడం మొదలవగానే మళ్లీ ‘యాడ్ బ్లాకర్’ను యాక్టివేట్ చేస్తున్నారు. ఇలాచేసే యూట్యూబ్ యూజర్స్‌కు అన్ని వీడియోస్ ప్లే కావడం లేదని తెలుస్తోంది. ఈవిధంగా మూడు వీడియోలను చూసిన తర్వాత మరోసారి యూట్యూబ్ నుంచి వార్నింగ్ నోటిఫికేషన్ వస్తోందని సమాచారం.
We’re now on WhatsApp. Click to Join.
యాడ్ బ్లాకర్ యాక్టివ్ అయి ఉన్న కారణంగా.. యూట్యూబ్‌లో ఒక వీడియో అయిపోయిన తర్వాత మరో వీడియో ప్లే అయ్యే ఫీచర్ కూడా చాలామందికి పనిచేయడం లేదు. ఈ లెక్కన యాడ్ బ్లాకర్‌ను పూర్తిస్థాయిలో తీసేస్తేనే యూట్యూబ్ వీడియోలను ఆటంకం లేకుండా ఎంజాయ్ చేయొచ్చు. అయితే వాటి మధ్యలో యాడ్స్ ఉంటాయి. ఒకవేళ యాడ్స్ వద్దు అని భావిస్తే.. యూట్యూబ్ ప్రీమియం ప్లాన్‌ను సబ్ స్క్రైబ్ (YouTube Vs Ad Blockers) చేసుకోవచ్చు.
Also Read: Jio World Plaza : ‘జియో వరల్డ్ ప్లాజా’ ప్రారంభం ఇవాళే.. విశేషాలివీ..
దీపావళికి జియో ప్రైమా 4జీ.. ప్రత్యేకతలు ఇవీ..
జియో ఫోన్ ప్రైమా 4జీ పేరిట మరో ఫోన్‌ను జియో లాంచ్ చేసింది. దీపావళికి ఈ ఫోన్ అందుబాటులోకి రానుంది. ఇది 2.4 అంగుళాల టీఎఫ్‌టీ డిస్‌ప్లేతో వస్తుంది. ఫ్లాష్‌లైట్, కెమెరా సదుపాయం ఉంది. ఎఫ్‌ఎం రేడియో సదుపాయం ఇస్తున్నారు. ఇందులో యూట్యూబ్, జియో టీవీ, జియో సినిమా, జియో సావన్, జియో న్యూస్ వంటి యాప్స్ ప్రీ ఇన్‌స్టాల్డ్‌గా వస్తున్నాయి. వాట్సాప్, ఫేస్‌బుక్ వంటి యాప్స్‌నూ వినియోగించుకోవచ్చు. జియో పే ద్వారా యూపీఐ పేమెంట్స్ చేయొచ్చు. మొత్తం 23 భాషలకు సపోర్ట్ చేస్తుంది.