500 Employees Layoff : ప్రైవేటు బ్యాంకులలో ఉద్యోగుల కోత కొనసాగుతోంది. యెస్ బ్యాంకు తాజాగా 500 మంది ఉద్యోగులను తొలగించింది. ఈవిధంగా తొలగింపునకు గురైన ఉద్యోగులకు అడ్వాన్సుగా 3 నెలల శాలరీని అందించారు. యెస్ బ్యాంకుకు చెందిన హోల్‌సేల్, రిటైల్, బ్రాంచ్ బ్యాంకింగ్ విభాగాల్లో ఉద్యోగులను తొలగించారు. బ్యాంక్ పునర్నిర్మాణ ప్రక్రియలో భాగంగా ఈమేరకు చర్యలు చేపట్టారు. తాము నియమించుకున్న అంతర్జాతీయ కన్సల్టెంట్ సలహా మేరకు ఉద్యోగ కోతల ప్రక్రియను యెస్ బ్యాంకు(500 Employees Layoff ) మొదలుపెట్టింది. యెస్ బ్యాంక్ భవిష్యత్తులో మరింత మంది ఉద్యోగులను తొలగించే అవకాశం ఉంది.
We’re now on WhatsApp. Click to Join
సిబ్బందిపై యెస్ బ్యాంకు ఖర్చులు
- 2023- 2024 ఆర్థిక సంవత్సరంలో సిబ్బందిపై యెస్ బ్యాంకు చేసిన ఖర్చులు 12 శాతానికిపైగా పెరిగాయి.
- 2023 ఆర్థిక సంవత్సరం చివరినాటికి సిబ్బందిపై యెస్ బ్యాంకు చేసిన ఖర్చులు రూ.3,363 కోట్లు ఉండగా.. అవి 2024 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి రూ.3,774 కోట్లకు పెరిగాయి.
Also Read :Lok Sabha Speaker : స్పీకర్‌జీ.. ఈసారి ఎంపీల సస్పెన్షన్ పర్వం జరగొద్దు : అఖిలేష్
ఎక్కువ బ్యాంకు ఖాతాలున్నాయా ?
కొంతమందికి ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలు ఉంటాయి. ఇలా ఎక్కువ బ్యాంకు ఖాతాలు ఉండటానికి చాలా కారణాలు ఉంటాయి. ఎక్కువ బ్యాంకు ఖాతాలు ఉండటానికి.. ఉద్యోగులకు, వ్యాపారులకు వేర్వేరు రకాల కారణాలు ఉంటాయి.ఏటీఎంల నుంచి తరచుగా నగదు తీసుకునే వారికి బహుళ బ్యాంకు ఖాతాలు ఉండటం ప్రయోజనకరం. ఎందుకంటే నెలకు నిర్ణీత సంఖ్యలో మాత్రమే ఏటీఎం కార్డులను ఉపయోగించాలన్న పరిమితి ఉంది. వేరే బ్యాంకుకు చెందిన ఏటీఎం ఉంటే, ఏటీఎంను ఎక్కువగా ఉపయోగించుకోవచ్చు. బ్యాంకులలో కనీస ఖాతా బ్యాలెన్స్ ఉండాలి. ఆ అకౌంట్లలో మినిమమ్ బ్యాలెన్స్‌ను మెయింటెన్ చేయడం అంత ఈజీ కాదు. అకౌంటులో మినిమం బ్యాలెన్స్ లేకుంటే పెనాల్టీ ఛార్జీలు పడొచ్చు. ఒకవేళ వాటిని కట్టకుంటే బ్యాంకులు ఆ ఖాతాలను తాత్కాలికంగా నిలిపివేయవచ్చు.