Site icon HashtagU Telugu

Vastu Tips : మెట్ల కింద ఇవి పెట్టొద్దు.. మెట్ల నిర్మాణానికి వాస్తు చిట్కాలు

Vastu Tips

Vastu Tips

Vastu Tips : ఇంట్లోని వస్తువులను తగిన ప్రదేశంలో పెట్టుకునే విషయంలోనూ కొన్ని వాస్తు నియమాలను మనం పాటించాల్సి ఉంటుంది.  చాలామంది మెట్ల కింద ఖాళీ స్థలం ఉంది కదా అని ఏ వస్తువు పడితే ఆ వస్తువును పెట్టేస్తుంటారు. ఇలా చేయడం వల్ల  ఇంట్లో ఉండేవారికి ఆర్థికంగా నష్టం వాటిల్లే  రిస్క్ చుట్టుముడుతుంది.అసలు మెట్లను ఇంట్లో ఏ వైపు నిర్మించాలి..? మెట్ల కింద ఏ వస్తువులను ఉంచకూడదు(Vastu Tips)  ఇప్పుడు తెలుసుకుందాం.

We’re now on WhatsApp. Click to Join.

నైరుతి లేదా వాయవ్య దిక్కులలో..

వాస్తు శాస్త్రం ప్రకారం.. ఇంట్లో మెట్లు నైరుతి లేదా వాయవ్య దిక్కులో ఉండాలి. ఈ దిక్కుల్లో మెట్లు ఉంటే కుటుంబంలో ఆనందం, శాంతి, పురోగతి వెల్లివిరుస్తాయి. ఒకవేళ ఈశాన్య దిశలో మెట్లు ఉంటే ఆర్థికంగా, ఆరోగ్యపరంగా నష్టం జరుగుతుంది. వ్యాపారంలో సమస్యలు వస్తాయి. మెట్ల విషయంలో తప్పకుండా వాస్తును ఫాలో కావాలి.

మేడ మీదకు మెట్లు నిర్మించేటప్పుడు..

ఇంటి మేడ మీదకి మెట్లు నిర్మించేటప్పుడు ఒక వరుస మెట్లను తూర్పు నుంచి పడమరకు లేదా ఉత్తరం నుంచి దక్షిణానికి ఎక్కే విధంగా నిర్మిస్తే మంచిది. మెట్లను రెండు వరుసలుగా నిర్మించాలనుకుంటే… మొదటి వరుస మెట్లను తూర్పు నుంచి పడమరకు వెళ్ళే విధంగానూ, రెండో వరస మెట్లను ఎటుపక్క తిరిగినా కూడా పడమర నుండి తూర్పుకు ఎక్కే విధంగా ఉండాలి.  రెండు వరసల మెట్లను…. ఒక వరుస ఉత్తరం నుండి దక్షిణం వైపుకు, రెండో వరస ఎటు తిరిగినా దక్షిణం నుండి ఉత్తరానికి ఎక్కేటట్లుగా కూడా నిర్మించుకుంటే చాలా మంచిది. “ఎల్” ఆకారంలో ఇంటి మెట్లను నిర్మించాలి అనుకునేవారు ముందుగా తూర్పు నుండి పడమరకుగానీ.. ఉత్తరం నుంచి దక్షిణానికిగానీ ఎక్కి అటు తరువాత ఎటువైపుకైనా తిరిగేలా ఏర్పాటు చేసుకోవాలి.  ఇంటికి బయటవైపున మెట్లను నిర్మించాలి అనుకుంటే, ఈశాన్య, వాయువ్య, నైరుతి, ఆగ్నేయ దిశలలో ఏ భాగాలలనైనా నిర్మించవచ్చు.

Also Read : CM Missing : జార్ఖండ్‌ సీఎం మిస్సింగ్.. 24 గంటలుగా కనిపించని సొరేన్

మెట్ల కింద పెట్టకూడని వస్తువులు

(గమనిక : ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌ సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. ఖచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.)