Plane In Ocean : అమెరికా ఆర్మీ అంటేనే ఎంతో పవర్ ఫుల్. అది వినియోగించే ఆయుధాలు కూడా చాలా కాస్ల్టీ. తాజాగా సోమవారం మధ్యాహ్నం అమెరికా నేవీకి చెందిన చెందిన పీ-8ఏ నిఘా విమానం కొంచెంలో పెద్ద గండం నుంచి బయటపడింది. లేదంటే దాదాపు రూ.1200 కోట్లు విలువ చేసే ఈ విమానం బూడిద కుప్పగా మారి ఉండేది. అమెరికాలోని హవాయి రాష్ట్రంలో ఉన్న మెరైన్ కోర్ బేస్‌లో రన్‌వేపై నుంచి గాల్లోకి ఎగిరిన కాసేపటికే పీ-8ఏ విమానం కంట్రోల్ కోల్పోయింది. అది అదుపు తప్పి కాగితపు విమానంలా తేలుతూ సముద్రంలో కుప్పకూలింది.
https://twitter.com/velerie_a/status/1726798820577824968?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1726798820577824968%7Ctwgr%5E9c9a03b0bcb72cd8a6dac7d536e4ec0651f8addd%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.etvbharat.com%2Ftelugu%2Ftelangana%2Finternational%2Fintl-top-news%2Fus-plane-crash-today-navy-p8a-poseidon-overshoots-hawaiian-runway-splashes-in-kaneohe-bay-crew-safe%2Fna20231121122505766766660
We’re now on WhatsApp. Click to Join.
లక్కీగా విమానం నుంచి ఇంధనం లీక్ కాకపోవడంతో పేలుడు సంభవించలేదు. ఒకవేళ పేలుడు సంభవించి ఉంటే.. ఈ విమానం నామరూపాలు లేకుండా మారిపోయి సముద్రంలో కలిసిపోయి ఉండేది. పీ-8ఏ విమానం టోర్పెడోలు, క్రూజ్ క్షిపణులను సైతం మోసుకెళ్లగలదు. ప్రమాదం జరిగిన టైంలో ఇందులో ఎలాంటి ఆయుధాలు ఉన్నాయనేది ఇంకా తెలియరాలేదు. విమానం గాల్లో ఎగురుతున్న సమయంలో విజిబిలిటీ తక్కువగా ఉండటం వల్లే, పైలట్ దాన్ని కంట్రోల్ చేయలేకపోయారని నేవీ అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో విమానంలో ఉన్న పైలట్‌కు కానీ, నేవీ సిబ్బందికి కానీ ఎలాంటి ప్రమాదమూ జరగలేదు.
Also Read: Bigg Boss 7 : డబుల్ ఎలిమినేషన్.. అందుకే ఆటగాళ్ల ప్లాన్ మారింది..!
వెంటనే కోస్టు గార్డ్ సిబ్బంది స్పందించి.. పీ-8ఏ విమానంలోని సిబ్బందిని సురక్షితంగా బయటికి తీశారు. అనంతరం విమానాన్ని తీరానికి తీసుకొచ్చారు. ప్రమాదం జరిగిన సమయంలో.. సముద్రంలో విమానం కూలిన పరిసరాల్లో బోటింగ్ చేస్తున్న వాళ్లు భయభ్రాంతులకు గురయ్యారు. విమానం సముద్రంలో తేలడం ఏమిటని సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, భారత్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, బ్రిటన్, నార్వే సైన్యాలు కూడా పీ-8ఏ విమానాలను(Plane In Ocean) వినియోగిస్తున్నాయి.