F-16 Fighters To Ukraine : రష్యాతో అమెరికా కోల్డ్ వార్.. ఉక్రెయిన్ కు F-16 యుద్ధ విమానాలు

F-16 Fighters To Ukraine : ఉక్రెయిన్ కు F-16 యుద్ధ విమానాలను (ఫైటర్ జెట్స్) ఏ దేశమైన అందిస్తే రష్యా ఊరుకుంటుందా ?

  • Written By:
  • Updated On - August 19, 2023 / 09:07 AM IST

F-16 Fighters To Ukraine : ఉక్రెయిన్ కు F-16 యుద్ధ విమానాలను (ఫైటర్ జెట్స్) ఏ దేశమైన అందిస్తే రష్యా ఊరుకుంటుందా ?

F-16 యుద్ధ విమానాలను ఉక్రెయిన్ కు అందించే దేశాలను కూడా రష్యా శత్రువుగా భావించే ఛాన్స్ ఉంటుందా ?

ఇన్నాళ్లు ఈ డౌట్స్ తో మల్లగుల్లాలు పడిన అమెరికా, నాటో కూటమిలోని దేశాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి.

ఉక్రెయిన్ కు F-16 యుద్ధ విమానాలను అందిస్తామని డెన్మార్క్, నెదర్లాండ్స్ పెట్టిన ప్రతిపాదనకు అమెరికా ఆమోదం తెలిపింది.

దీంతో ఆ రెండు దేశాల నుంచి దాదాపు పది F-16 యుద్ధ విమానాలు ఉక్రెయిన్ కు అందేందుకు మార్గం సుగమం అయింది.

Also read : Good Bye To RC Cards : డ్రైవింగ్‌ లైసెన్సు, ఆర్‌సీ కార్డులకు గుడ్ బై.. ఇకపై డిజిటల్ డాక్యుమెంట్స్ 

గత నెల (జులై) చివరి వారంలోనే ఉక్రెయిన్ ఎయిర్ ఫోర్స్ కు F-16 యుద్ధ విమానాలు నడిపే ట్రైనింగ్ (F-16 Fighters To Ukraine) మొదలైంది. ఆ ట్రైనింగ్ పూర్తయిన వెంటనే F-16లను అందిస్తామని డెన్మార్క్, నెదర్లాండ్స్ రక్షణ శాఖలు ప్రకటించాయి. మాతృభూమిని రక్షించుకునేందుకు ఉక్రెయిన్ సేనలకు ఈ యుద్ధ విమానాలు సహాయపడతాయని ఆశాభావం వ్యక్తం చేశాయి. ఈవిషయంలో తమ ప్రపోజల్ కు అంగీకారం తెలిపిన అమెరికాకు థాంక్స్ చెప్పాయి. ఇక ఈ వార్త తెలిసిన వెంటనే ఉక్రెయిన్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అమెరికా నిర్ణయాన్ని ఉక్రెయిన్‌ రక్షణ మంత్రి ఒలెక్సీ రెజ్నికోవ్ “గొప్ప వార్త”గా అభివర్ణించారు. తమ సైన్యం ప్రస్తుతం F-16లను నడపడంలో ట్రైనింగ్ తీసుకుంటోందని తెలిపారు. వేగంగా ట్రైనింగ్ పూర్తి చేసి F-16లను అందుకుంటామని చెప్పారు. ఈ యుద్ధంలో రష్యాపై ఉక్రెయిన్ విజయం అనివార్యమని కామెంట్ చేశారు. ఈమేరకు ఆయన ట్విట్టర్ లో ఒక పోస్ట్ చేశారు.

Also read : Railways: లీజులకు రైల్వే భూములు.. రూ. 7,500 కోట్లు సమీకరించేందుకు ప్రణాళిక సిద్ధం..!

F-16 యుద్ధ విమానం ప్రత్యేకత.. 

F-16 యుద్ధ విమానం అనేది ప్రపంచంలోని అత్యంత విశ్వసనీయమైన యుద్ధ విమానాలలో ఒకటి. ఇది గైడెడ్ క్షిపణులు, బాంబులను  మోసుకెళ్లగలదు.  గంటకు 2400 కిలోమీటర్ల స్పీడ్ తో ఎగరడం దీని ప్రత్యేకత. అన్ని వాతావరణ పరిస్థితులలో.. రాత్రివేళల్లోనూ ఖచ్చితత్వంతో  శత్రు లక్ష్యాలపై దాడులు చేసేందుకు F-16 యుద్ధ విమానాలు ఉపయోగపడతాయి. ప్రస్తుతం ఉక్రెయిన్‌ దగ్గర సోవియట్ కాలం నాటి మిగ్ విమానాలే ఉన్నాయి.. అందుకే గగన తలంలో రష్యాను ఎదుర్కోలేకపోతోంది.