Site icon HashtagU Telugu

Trump – Russia Attack : నాటో దేశాలపైకి నేనే రష్యాను ఉసిగొల్పుతా: ట్రంప్‌

Trump Russia Attack

Trump Russia Attack

Trump – Russia Attack : నాటో కూటమిలోని దేశాలపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిబంధన ప్రకారం రక్షణ బడ్జెట్లను పెంచుకోవాలని నాటో  దేశాలకు సూచించారు. ఒకవేళ అలా చేయకుంటే.. తానే నాటో దేశాలపైకి రష్యాను ఉసిగొల్పుతానని రిపబ్లికన్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీపడుతున్న డొనాల్డ్ ట్రంప్‌ కామెంట్ చేశారు. అమెరికాలోని దక్షిణ కరోలినా రాష్ట్రంలో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో మాట్లాడుతూ ఈ అంశాన్ని ట్రంప్ లేవనెత్తారు. తన హయాంలో నిర్వహించిన నాటో కూటమి సమావేశం సందర్భంగా సభ్య దేశాల అధినేతలకు ఈ విషయాన్ని తేల్చి చెప్పానని ఆయన గుర్తు చేసుకున్నారు.

We’re now on WhatsApp. Click to Join

ట్రంప్ కామెంట్ ఇదీ.. 

‘‘గతంలో జరిగిన నాటో కూటమి సమావేశంలో ఓ దేశాధినేత మాట్లాడుతూ.. కూటమి నిబంధనల మేరకు మేం రక్షణపై ఖర్చు చేయలేదనుకోండి.. మాపై రష్యా దాడి చేస్తే అమెరికా కాపాడదా? అని నన్ను ప్రశ్నించారు. అయితే వారిని అమెరికా రక్షించదని నేను నిర్మొహమాటంగా చెప్పాను. మాస్కో ఏం కావాలనుకుంటే అది చేయాలని ప్రోత్సహిస్తానని కుండబద్దలు కొట్టాను ’’ అని ఆనాడు చేసిన వ్యాఖ్యలను ట్రంప్(Trump – Russia Attack) మరోసారి చెప్పుకొచ్చారు. అమెరికా నిధులు, సైనిక శక్తిని దుర్వినియోగం చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

Also Read : Baby In Oven : ఓవెన్‌లో పసికందును పెట్టిన తల్లి.. ఎందుకు ? ఏమైంది ?

ట్రంప్‌ వ్యాఖ్యలపై అమెరికా వైట్ హౌస్ అధికార ప్రతినిధి ఆండ్రూ బెట్స్‌ స్పందిస్తూ.. ‘‘రష్యా హంతక పాలకులను అమెరికా మిత్రదేశాలపైకి ఉసిగొల్పుతానని ట్రంప్ అనడం భయంకరమైన విషయం. ఇలాంటివి అమెరికా సహా యావత్ ప్రపంచంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తాయి’’ అని పేర్కొన్నాయి. 2014లో క్రిమియాను రష్యా ఆక్రమించిన తర్వాత నాటో సభ్య దేశాలు అప్రమత్తమయ్యాయి. కోల్డ్‌వార్‌ తర్వాత భారీగా తగ్గించిన రక్షణ ఖర్చును మళ్లీ పెంచాలని నాటో దేశాలు నిర్ణయించాయి. 2024 నాటికి ఆయా దేశాల జీడీపీలో ఇది కనీసం 2 శాతం ఉండేలా చూసుకోవాలనుకున్నాయి. ప్రస్తుతం నాటోలో ఉన్న 31 దేశాల్లో కేవలం ఏడు మాత్రమే ఈ నిబంధనను పూర్తి చేశాయి.