International Translation Day : ఇవాళ ‘అంతర్జాతీయ అనువాద దినోత్సవం’. గూగుల్ ట్రాన్స్ లేట్ చూశారు కదా.. అనువాద రంగంలో వచ్చిన విప్లవానికి అది గొప్ప నిదర్శనం. అందులో ఈజీగా ఒక ల్యాంగ్వేజ్ నుంచి ఇంకో ల్యాంగ్వేజ్ లోకి తర్జుమా చేయొచ్చు. ఒక భాషలోని భావాలు మరో భాష మాట్లాడే ప్రజలకు అర్థం కావాలంటే.. కచ్చితంగా అనువాదం అవసరం. ఉదాహరణకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హిందీలో చేసే ప్రసంగాన్ని.. తెలుగు మీడియా జర్నలిస్టులు తెలుగులోకి అనువదించి మనకు అందిస్తుంటారు. అలాగే అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ ఇంగ్లిష్ లో చేసే ప్రసంగాన్ని తెలుగులోకి అనువదించి మనకు అందిస్తున్నారు. ఇంకా ఇతరత్రా భాషల పుస్తకాలెన్నో మన తెలుగులోకి ట్రాన్స్ లేట్ అవుతున్నాయి. ఒక్క తెలుగు అనే కాదు.. మరెన్నో ప్రపంచ భాషల్లోకి తర్జుమా అవుతున్నాయి. ఇక మన తెలుగు సినిమాలు కూడా ప్రపంచంలోని ఎన్నో భాషల్లోకి తర్జుమా అవుతున్నాయి. ఆర్ఆర్ఆర్ సినిమా, బాహుబలి సినిమా సహా మరెన్నో తెలుగు సినిమాలు ఇటీవల ఇతరత్రా ప్రపంచ భాషల్లోకి తర్జుమా అయ్యాయి. మీడియా, వినోద రంగ సంస్థలు కూడా అన్ని భాషల్లోకి తమ వార్తా సేవలను విస్తరిస్తున్నాయి. ఈవిధంగా ప్రతీ రంగాన్ని ట్రాన్స్ లేషన్ టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కిస్తోంది. వాటి ఆదాయాలను పెంచుతోంది.
Also read : Two Trains Collided : రెండు రైళ్లు ఢీ.. బోగీలు చెల్లాచెదురు.. ప్యాసింజర్స్ హడల్
ప్రతిపాదించిన 64 ఏళ్ల తర్వాత..
ప్రపంచదేశాల మధ్య వారధిలా పనిచేసే అనువాద ప్రక్రియకు ఏడాదిలో ఓ రోజును కేటాయించాలని ‘ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ట్రాన్స్ లేటర్’ అనే సంస్థ 1953లో ప్రతిపాదించింది. కానీ ఆ విషయాన్ని చాలా ఏళ్ల పాటూ ఎవరూ పట్టించుకోలేదు. ఆరేళ్ల క్రితమే ఐక్యరాజ్య సమితి (యునైటెడ్ నేషన్స్) జనరల్ అసెంబ్లీలో అనువాద దినోత్సవాన్ని జరుపుకోవాలని నిర్ణయించారు. తొలిసారి అనువాద దినోత్సవాన్ని 2017 సెప్టెంబర్ 30 నిర్వహించారు. తొలుత కేవలం అజర్ బైజాన్, బంగ్లాదేశ్, బెలారస్, కోస్టారికా, క్యూబా, టర్కీ… ఇలా కొన్ని చిన్నదేశాలు మాత్రమే డ్రాఫ్ట్ రిజల్యూషన్ పై సంతకాలు చేశాయి. 2018 నుంచి అమెరికా ట్రాన్స్ లేటర్స్ అసోసియేషన్ కూడా సెప్టెంబరు 30న అంతర్జాతీయ అనువాద దినోత్సవాన్ని నిర్వహించుకోవడం ప్రారంభించింది.
అనువాదకుల పితామహుడు ఆయనే..
‘అంతర్జాతీయ అనువాద దినోత్సవం’ను బైబిల్ అనువాదకుడు సెయింట్ జెరోమ్ కు అంకితమిచ్చారు. ఈయనను ప్రపంచ అనువాదకుల పితామహుడిగా పిలుస్తారు. ఈయన ఇటలీకి చెందిన ప్రీస్ట్. గ్రీకు భాషలో ఉన్న బైబిల్ ను లాటిన్ భాషలోకి అనువాదం చేశారు. ఈయన క్రీస్తు పూర్వం 420లో సెప్టెంబర్ 30న బెత్లెహామ్ నగరానికి సమీపంలో మరణించారు. ఆయన జన్మించిన తేదీ ఎవరికీ తెలియదు. అందుకే చనిపోయిన రోజునే.. ఆయన గౌరవార్థం అంతర్జాతీయ అనువాద దినోత్సవంగా (International Translation Day) జరుపుకుంటున్నారు.