Site icon HashtagU Telugu

Two Trains Collided : రెండు రైళ్లు ఢీ.. బోగీలు చెల్లాచెదురు.. ప్యాసింజర్స్ హడల్

Two Trains Collided1

Two Trains Collided1

Two Trains Collided :  స్కాట్లాండ్‌లోని హైలాండ్స్‌లో ఉన్న ఏవీమోర్ రైల్వే స్టేషన్‌ సమీపంలో ఒకే ట్రాక్ పై రెండు రైళ్లు ఒకదాన్నొకటి ఢీకొన్నాయి.  శుక్రవారం రాత్రి 7:00 గంటలకు చోటుచేసుకున్న ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. గాయపడిన  వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పలువురికి సంఘటనా స్థలంలోనే చికిత్స అందించి ఇళ్లకు పంపారు. బ్రిటన్ రాజధాని లండన్‌కు 965 కిలోమీటర్ల దూరంలో ఏవీమోర్ రైల్వే  స్టేషన్‌ ఉంది. రైళ్లు ఢీకొనగానే వాటిలో ఉన్న ప్రయాణికులు హడలెత్తారు. ఏం జరుగుతుందో అర్థం కాక భయంతో వణికిపోయారు. రెండు రైళ్లు ఢీకొనగానే బోగీలు ఒక్కసారిగా కుదుపునకు గురవడంతో.. బోగీలలో ఉన్న ప్రయాణికులు అరవడం మొదలుపెట్టారు. కొన్ని బోగీలు రైల్వే ట్రాక్ పక్కనున్న గుంతలోకి దొర్లి పడిపోయాయి. అలా పడిపోయిన బోగీలలో ఉన్నవారికి గాయాలయ్యాయి. వాస్తవానికి గాయపడిన వారి సంఖ్య ఇంకా ఎక్కువే ఉండొచ్చని మీడియా వర్గాలు చెబుతున్నాయి.

Also read : Bowl Massage : బౌల్ మసాజ్ చేసుకోండి ఇలా.. అందాన్ని, ఆరోగ్యాన్ని పొందండి..

ఈ ప్రమాదానికి గురైన రెండు రైళ్లలో ఒకటి ‘ఫ్లయింగ్ స్కాట్స్‌మన్’ మోడల్ కు చెందినది. ఇది చాలా దశాబ్దాల కిందటి రైలు. ఈ స్టీమ్ ఇంజిన్ రైలు గంటకు 100 మైళ్ల వేగంతో నడుస్తుంది. ఈ ప్రమాద ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని స్కాట్లాండ్ పోలీసులు చెప్పారు.  ప్రమాదం జరిగిన తర్వాత ఏవీమోర్ స్టేషన్ మార్గంలో రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. అయితే ఈ ప్రమాదం జరిగినది ఒక ప్రైవేటు రైలు మార్గంలో, దీంతో ఆ రూట్ లో రైలు సర్వీసులను క్రమబద్ధీకరించే సంస్థపై భారీ జరిమానా విధించే అవకాశం ఉందని అంటున్నారు. గతంలోనూ ఈవిధంగా రైలు ప్రమాదాలు జరిగినప్పుడు, రైల్వే రూట్ నిర్వాహక సంస్థలపై భారీ జరిమానాలు (Two Trains Collided) విధించారు.