Site icon HashtagU Telugu

Sri Lanka Cricket Board : శ్రీలంక క్రికెట్‌ బోర్డు రద్దు.. ఎందుకో తెలుసా ?

Sri Lanka Cricket Board

Sri Lanka Cricket Board

Sri Lanka Cricket Board : శ్రీలంక ప్రభుత్వం క్రికెట్‌ బోర్డును రద్దు చేసింది. ఇటీవల జరిగిన భారత్‌-శ్రీలంక వరల్డ్ కప్ మ్యాచ్‌లో శ్రీలంక ఘోరంగా ఓడిపోయింది. ఈనేపథ్యంలో క్రికెట్ బోర్డును శ్రీలంక సర్కారు రద్దు చేయడం గమనార్హం. లంక క్రికెట్ బోర్డ్‌ సెక్రటరీ మోహన్ డి సిల్వా రాజీనామా చేసిన వెంటనే ఈమేరకు ప్రకటన వెలువడింది. ఆయన ఇంటి ఎదుట ఆందోళనలు జరగడంతో.. లంక క్రికెట్ టీమ్  ఓటమికి బాధ్యత వహిస్తూ తన పదవి నుంచి తప్పుకున్నారు. ఆ వెంటనే లంక క్రికెట్ బోర్డును రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని శ్రీలంక క్రీడాశాఖ మంత్రి రోషన్ రణసింఘే ప్రకటించారు. బోర్డులోని సభ్యులందరినీ తొలగించినట్లు తెలిపారు.

We’re now on WhatsApp. Click to Join.

క్రికెట్ బోర్డు స్థానంలో మధ్యంతర కమిటీని ఏర్పాటు చేశామని రోషన్ రణసింఘే  అన్నారు. దానికి అర్జున రణతుంగ నేతృత్వం వహిస్తారని తెలిపారు. ఏడుగురు సభ్యులతో కూడిన ఈ కమిటీలో రణతుంగతో పాటు ముగ్గురు న్యాయమూర్తులను సభ్యులుగా నియమించారు. 1996లో రణతుంగ కెప్టెన్సీలోనే  శ్రీలంక ప్రపంచ కప్ గెలిచింది. క్రికెట్ ఎన్నికలు జరిగేంత వరకూ ఈ కమిటీ కొనసాగుతుంది. క్రికెట్‌ బోర్డులో అవినీతిని తగ్గించడంతో పాటు కీలక ప్రతిపాదనలు చేయాలన్న ఉద్దేశంతో ఈ కమిటీని ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకూ వరల్డ్ కప్‌లో శ్రీలంక 7 మ్యాచ్‌లు ఆడగా  5 ఓడిపోయింది. ఫలితంగా సెమీఫైనల్ రేసు నుంచి(Sri Lanka Cricket Board) తప్పుకుంది.

Also Read: Siri Hanmanth : జబర్దస్త్ లో కొత్త యాంకర్.. బిగ్ బాస్ తర్వాత అమ్మడికి లక్కీ ఛాన్స్..!