Viral Video:డెడికేషన్ కు హ్యాట్సాఫ్.. దివ్యాంగురాలి హార్డ్ వర్క్ కు నెటిజన్స్ ఫిదా!!

నిండు ఆరోగ్యం ఉన్నా సోమరితనంతో రోజులు గడిపే వాళ్ళను చూస్తుంటాం. టైం పాస్ చేసే వాళ్ళను.. టైం వేస్ట్ చేసే వాళ్ళను చూస్తుంటాం. ఇలాంటి వాళ్లకు గుణపాఠం ఈ వీడియో.

  • Written By:
  • Publish Date - September 12, 2022 / 11:40 AM IST

నిండు ఆరోగ్యం ఉన్నా సోమరితనంతో రోజులు గడిపే వాళ్ళను చూస్తుంటాం. టైం పాస్ చేసే వాళ్ళను.. టైం వేస్ట్ చేసే వాళ్ళను చూస్తుంటాం. ఇలాంటి వాళ్లకు గుణపాఠం ఈ వీడియో.
దివ్యాంగురాలైన ఓ యువతి వీల్ చైర్ లో ఆన్ లైన్ ఫుడ్ ను డెలివరీ చేస్తున్న వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఆ యువతి ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ ఏజెంట్ అని తెలుస్తోంది. ఆమె వీపుపై స్విగ్గీ బ్యాగ్‌ను కూడా మనం చూడవచ్చు. ఆమె ఎక్కడ పనిచేస్తుందో తెలియదు కానీ ఆమె తపనను చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. వీల్‌చైర్‌ను బైక్‌గా మార్చుకుని కస్టమర్లకు ఫుడ్‌ డెలివరీ చేస్తున్న విధానాన్ని చూసి హ్యాట్సాఫ్ అంటున్నారు. నేటి తరం యువతకు ఆమె ఆదర్శమంటూ సోషల్‌ మీడియాలో పోస్టులు షేర్‌ చేస్తున్నారు. నెటిజన్లను తెగ ఆకర్షిస్తుంది.ఈ వీడియోకు 2 లక్షలకు పైగా వ్యూస్‌ రావడం విశేషం. అలాగే 10వేల మందికి పైగా లైకులు కొట్టారు. ఇలా ప్రతి ఒక్కరూ ఆలోచిస్తే , పనులు చేస్తే మన దేశంలో నిరుద్యోగ సమస్య తగ్గుతుంది. సంకల్పం, పట్టుదల ఉంటే ఎలాంటి అవరోధాలనైనా అధిగమించ వచ్చని చాలామంది దివ్యాంగులు నిరూపించారు. నిరూపిస్తూనే ఉన్నారు. ఇలాంటి ఎన్నో వీడియోలు నెట్టింట్లో దర్శనమిస్తుంటాయి. అవి చూడడానికి ఎంతో స్ఫూర్తిని కలిగిస్తుంటాయి.

స్వాతి మలివాల్ ట్వీట్..

ఈ వీడియోను ఢిల్లీ కమిషన్ ఫర్ వుమెన్ చైర్‌పర్సన్ స్వాతి మలివాల్ ట్వీట్ చేశారు. ‘జీవితం నిస్సందేహంగా చాలా  కష్టమైనది. కానీ, మేం రాజీ పడం. ఆమె స్పిరిట్‌కు నేను సెల్యూట్ చేస్తున్నా’ అని ఆమె కోట్ యాడ్ చేశారు.

మరొకరు కూడా..

ఇలాంటి వీడియోనే మరొక ట్విట్టర్ హ్యాండిల్ పోస్టు చేసింది. వీల్ చైర్ ఆధారంగానే ఓ దివ్యాంగురాలైన యువతి జొమాటో డెలివరీ చేస్తున్నట్టుగా ఈ వీడియోలో కనిపిస్తున్నది.

ప్రభుత్వ వైఫల్యం వల్లే..

ఈ వీడియోలపై చాలా మంది నెటిజన్లు కామెంట్లు పెట్టారు. అందులో చాలా మంది సదరు యువతిని ప్రశంసల్లో ముంచెత్తారు. కాగా, ఒక యూజర్ మాత్రం కొంచెం భిన్నంగా కామెంట్ పెట్టారు. ఆ లేడీ హార్డ్ వర్క్‌కు తాను కూడా సెల్యూట్ చేస్తానని మొదటి లైన్‌లో రాశాడు. ఆ తర్వాత కానీ, ఈ వీడియో తనను ఆలోచింప చేస్తున్నదని పేర్కొన్నాడు. ఒక సమాజంగా మనం, లేదా ప్రభుత్వం వికలాంగులకు కనీస అవసరాలను సమకూర్చడంలో విఫలం అయ్యామేమో అని అనిపిస్తున్నదని వివరించాడు. అందువల్లే వారు అలాంటి కష్టాలను ఎదుర్కోవలసి వస్తున్నదని పేర్కొన్నాడు.