Site icon HashtagU Telugu

world cup 2023: ఉత్కంఠ పోరులో పాకిస్తాన్ పై సౌతాఫ్రికా విజయం

World Cup 2023 (57)

World Cup 2023 (57)

world cup 2023: పాకిస్థాన్, సౌతాఫ్రికా జట్ల మధ్య సాగిన ఉత్కంఠ మ్యాచ్‌లో సౌతాఫ్రికా విజయం సాధించింది. చివరి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్ లో ఒక వికెట్ తేడాతో పాకిస్థాన్‌ను ఓడించింది. ఈ మ్యాచ్‌లో ఓడిపోవ‌డంతో పాకిస్థాన్ సెమీస్ అవ‌కాశాలు సంక్లిష్టంగా మారాయి.

తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 270 పరుగులు చేసింది. లక్ష్యఛేదనలో సౌతాఫ్రికా 9 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. ఐడెన్ మార్క్రామ్ తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. 93 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్ల సహాయంతో 91 పరుగులు సాధించాడు. మొద‌ట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 46.4 ఓవర్లలో 270 పరుగులకు అలౌటైంది. బాబర్ అజామ్, సౌద్ షకీల్ అర్ధ సెంచరీలు సాధించారు. షాదాబ్‌ ఖాన్‌ (43) ఫర్వాలేదనిపించాడు. ద‌క్షిణాఫ్రికా బౌలర్లలో తబ్రైజ్‌ షంసీ నాలుగు వికెట్లు తీశాడు. మార్కో జాన్సన్ మూడు, గెరాల్డ్‌ కొయిట్జీ రెండు, లుంగి ఎంగిడి ఓ వికెట్ ప‌డ‌గొట్టాడు.

పాకిస్థాన్ జట్టు: ఇమామ్ ఉల్ హక్, అబ్దుల్లా షఫీక్, బాబర్ ఆజం (కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్, సౌద్ షకీల్, ఇఫ్తీకర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, షాహీన్ అఫ్రిది, మహ్మద్ వాసిమ్ మరియు హారిస్ రవూఫ్.

దక్షిణాఫ్రికా జట్టు: టెంబా బావుమా (కెప్టెన్), క్వింటన్ డి కాక్, రాస్సీ వాన్ డెర్ డస్సెన్, ఐడెన్ మార్క్రామ్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, తబ్రైజ్ షమ్సీ, గెరాల్డ్ కోయెట్జీ మరియు లుంగి ఎన్గిడి.

Also Read: NTR – ANR : తనతో కలిసి నటించడానికి ఏఎన్నార్ ఒప్పుకోవడం లేదని.. ముఖ్యమంత్రితో చెప్పించిన ఎన్టీఆర్..