Site icon HashtagU Telugu

POSH Act : వర్కింగ్ ఉమెన్స్‌‌కు రక్షణ కవచం.. POSH యాక్ట్ వివరాలివీ

Posh Act

Posh Act

POSH Act : పని ప్రదేశాల్లో మహిళలు లైంగిక వేధింపులను ఎదుర్కొంటున్న ఘటనలు నిత్యం ఏదో ఒకటి మనదేశంలో వెలుగుచూస్తూనే ఉన్నాయి.  ఇటువంటి పరిస్థితుల్లో వర్కింగ్ ఉమెన్స్‌కు రక్షణ కల్పించే చట్టం ఒకటి ఉంది. దాని పేరే POSH యాక్ట్. POSH అంటే.. ‘ప్రివెన్షన్‌ ఆఫ్‌ ది సెక్సువల్‌ హెరాస్‌మెంట్‌ ఆఫ్‌ ఉమెన్‌ ఎట్‌ వర్క్‌ప్లేస్‌’. వర్కింగ్స్ ఉమెన్స్ దీనిపై కనీస అవగాహన కలిగి ఉండాలి. ఈ చట్టం 2013 సంవత్సరం నుంచి అమల్లోకి వచ్చింది. పని ప్రదేశంలో లైంగిక వేధింపులను ఎదుర్కొనే  మహిళలు POSH యాక్ట్ కింద ఫిర్యాదు చేయొచ్చు.

We’re now on WhatsApp. Click to Join.

POSH యాక్ట్ వివరాలివీ.. 

  • మహిళలను అనుచితంగా తాకడం
  • మహిళలు శారీరకంగా అసౌకర్యంగా ఫీలయ్యేలా చేయడం
  • మహిళలకు సైగలు చేయడం
  • లైంగిక వ్యాఖ్యలు చేయడం
  • అశ్లీల కంటెంట్‌ను వారికి షేర్ చేయడం
  • లైంగిక అంశాలపై ఏదైనా చేయాలని అడగడం
  • పై కారణాలతో వర్క్ ప్లేస్‌లో/జాబ్ చేసే చోట ఎవరైనా వేధిస్తే బాధిత మహిళలు నిర్భయంగా posh యాక్ట్ కింద ఫిర్యాదు చేయొచ్చు.
  • వర్కింగ్ ఉమెన్స్ నుంచి ఇటువంటి కంప్లయింట్స్‌ను స్వీకరించడానికి ప్రతీ కంపెనీలో అంతర్గత ఫిర్యాదుల కమిటీ ఉంటుంది. ఇలాంటి కమిటీలను ప్రతి సంస్థ ఏర్పాటు చేయాలనేది నిబంధన. ఈ కమిటీలో సగం మంది మహిళలే ఉండాలి. వర్క్ ప్లేస్‌లో వేధింపులు ఎదుర్కొనే మహిళల ఫిర్యాదులను విచారించి posh యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకోవడమే ఈ కమిటీల పని.
  • వేధింపులు ఎదుర్కొన్న 90 రోజుల్లోగా బాధిత మహిళ కంప్లయింట్ చేయొచ్చు. తొలుత ఆఫీసులో కంప్లయింట్ చేయాలి. ఆఫీసు అంతర్గత ఫిర్యాదుల కమిటీ తన విచారణ నివేదికను 10 రోజుల్లోగా సంస్థకు ఇస్తుంది. నిందితులు దోషిగా తేలితే  posh యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకుంటారు. అవసరమైతే పోలీస్​ స్టేషన్​‌ను కూడా ఆశ్రయిస్తారు.
  •  ఇలాంటి విషయాల్లో ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్​కు వెళితే గౌరవానికి భంగం కలుగుతుందనే భావన మహిళలకు ఉంటుంది.  అందుకే కంపెనీల్లో అంతర్గత ఫిర్యాదుల కమిటీ విధానాన్ని posh యాక్ట్(POSH Act) ద్వారా  అందుబాటులోకి తెచ్చారు.

Also Read: Viral Video : పెట్రోలుకు కటకట.. గుర్రంపై జొమాటో బాయ్ ఫుడ్ డెలివరీ