Site icon HashtagU Telugu

Sam Altman Returns : ఓపెన్ ఏఐలోకి తిరిగొచ్చేసిన సామ్ ఆల్ట్‌మన్‌.. ఏమైందంటే ?

Openai

Openai

Sam Altman Returns : సామ్ ఆల్ట్‌మన్‌.. అదేనండీ ఛాట్ జీపీటీ ‘ఓపెన్ ఏఐ’ (OpenAI) కంపెనీ మాజీ సీఈవో మళ్లీ సొంతగూటికి తిరిగి వచ్చేశారు. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ఆహ్వానం మేరకు మైక్రోసాఫ్ట్ ఏఐ టీమ్‌లో చేరాలని భావించిన ఆయన అకస్మాత్తుగా తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఓపెన్ ఏఐ కంపెనీలోని మొత్తం 700 మంది ఉద్యోగుల్లో దాదాపు 505 మంది వార్నింగ్ ఫలించింది. సామ్ ఆల్ట్‌మన్‌ లాంటి ట్యాలెంటెడ్ పర్సన్‌ను సీఈవో పోస్టు నుంచి తప్పించిన కంపెనీ బోర్డులోని సభ్యులంతా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఓపెన్ ఏఐలోని 505 మంది ఉద్యోగులు లేఖ రాశారు. దాన్ని కంపెనీ బోర్డులోని సభ్యులందరికీ పంపారు. ఒకవేళ కంపెనీ బోర్డును వెంటనే ప్రక్షాళన చేయకపోతే.. తామంతా జాబ్స్‌కు రాజీనామా చేసి సామ్ ఆల్ట్‌మన్‌తో కలిసి మైక్రోసాఫ్ట్‌లో చేరిపోతామని ఉద్యోగులు తేల్చి చెప్పారు. ఉద్యోగుల ఈ వార్నింగ్‌తో కంపెనీలో కలకలం రేగింది.

We’re now on WhatsApp. Click to Join.

ఒకేసారి 505 మంది టెక్ నిపుణులు వెళ్లిపోతే ఓపెన్ ఏఐకి తీవ్రమైన ఆర్థిక నష్టం కలుగుతుంది. పోటీ సంస్థలను ఢీకొనే పరిస్థితులు ఉండవు. అందుకే సామ్ ఆల్ట్‌మన్‌ను సీఈవో పోస్టు నుంచి తప్పిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని కంపెనీ బోర్డు పునస్సమీక్షించింది. మరోవైపు ఓపెన్‌ ఏఐలో పెట్టుబడులు పెట్టినవారు కూడా శామ్‌ ఆల్ట్‌మన్‌‌ను తిరిగి సంస్థలోకి తీసుకోవాలని బోర్డ్‌ సభ్యులపై ఒత్తిడి తెచ్చారు. దీంతో సామ్ ఆల్ట్‌మన్‌తో రహస్య చర్చలు జరిపి తిరిగి సంస్థలో చేరేలా ఒప్పించారు.

Also Read: TTD Jobs : టీటీడీలో జాబ్స్.. లక్షన్నర శాలరీ.. రేపే లాస్ట్ డేట్

మరోవైపు శామ్‌ ఆల్ట్‌మన్‌ మైక్రోసాఫ్ట్‌లో చేరడం కంటే, తిరిగి ఓపెన్‌ ఏఐకి వెళితేనే బాగుంటుంది అనేలా సత్యనాదెళ్ల కూడా సంకేతాలిచ్చారు. దీంతో మళ్లీ తన పేరెంట్ ఆర్గనైజేషన్ ఓపెన్ ఏఐలోకి వెళితేనే బాగుంటుందని సామ్ డిసైడ్ అయ్యారు. అంతేకాదు.. తిరిగి వస్తూ వస్తూ.. మైక్రోసాఫ్ట్ ఏఐ టీమ్‌ను లీడ్ చేస్తున్న గ్రెగ్ బ్రాక్‌మన్‌‌ను కూడా తనతో పాటు ఓపెన్ ఏఐలోకి తీసుకొచ్చారు. దాంతోపాటు  ఉద్యోగులు కోరిన విధంగా ఓపెన్ ఏఐ కంపెనీ బోర్డులో కొత్త సభ్యులుగా బ్రెట్ టేలర్, లారీ సమ్మర్స్, ఆడమ్ డి ఏంజెలోలను(Sam Altman Returns) నియమించారు.