Site icon HashtagU Telugu

Rahul Gandhi Tweet: పోలింగ్ వేళ రాహుల్ గాంధీ ఆసక్తికర ట్వీట్.. “దొరలపై ప్రజలు గెలవబోతున్నారు..”!

Rahul Gandhi Tweet

Rahul Gandhi

Rahul Gandhi Tweet: తెలంగాణలో గురువారం ఉదయం నుంచే అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓట్లు వేయడానికి రాష్ట్ర ఓటర్లు బారులు తీరారు. ఎన్నికల పోలింగ్ జోరుగా ప్రారంభమైంది. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ స్టేషన్లకు తరలివస్తున్నారు. ఇప్పటికే పలువురు రాజకీయ ప్రముఖులు, సినీ హీరోలు కుటుంబసమేతంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi Tweet) ఓటింగ్ కు సంబంధించి ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు.

Also Read: Jr. NTR : జూబ్లీహిల్స్‌లో ఓటు హ‌క్కు వినియోగించుకున్న జూనియ‌ర్ ఎన్టీఆర్‌

ఆ ట్వీట్ లో ఏముందో ఒకసారి చూద్దాం. నేడు దొరలపై ప్రజలు గెలవబోతున్నారు. నా తెలంగాణ సోదర సోదరీమణులారా! రండి.. అధిక సంఖ్యలో ఓటింగ్ లో పాల్గొనండి. బంగారు తెలంగాణ నిర్మాణం కోసం ఓటేయ్యండి! కాంగ్రెస్ ను గెలిపించండి! అంటూ రాహుల్ గాంధీ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఓటింగ్ జరిగే సమయంలో ఇలా ట్వీట్ చేయటం కరెక్ట్ కాదని ఇతర పార్టీ నాయకులు విమర్శిస్తున్నారు. రాష్ట్రంలో పలుచోట్ల ఈవీఎంలు మొరాయిస్తున్నాయి. దీంతో ఓటింగ్ ఆలస్యం అయింది.

We’re now on WhatsApp. Click to Join.