Site icon HashtagU Telugu

Ebrahim Raisi : ఇరాన్ సుప్రీంలీడర్ పదవికి పోటీ.. రైసీ మరణంలో కొత్త కోణం

Ebrahim Raisi

Ebrahim Raisi

Ebrahim Raisi : యావత్ ఇరాన్ దేశం శోకసంద్రంలో మునిగి ఉంది. హెలికాప్టర్ ప్రమాదంలో దేశ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ, విదేశాంగ మంత్రి హొస్సేన్‌ అమీర్ అబ్దుల్లా హియాన్‌లు ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన నుంచి ఇంకా ఇరాన్ కోలుకోలేదు.  సోమవారం నుంచి ఐదురోజుల పాటు(శుక్రవారం వరకు) ఇరాన్ సంతాప దినాలను పాటించనుంది. మరోవైపు ఈ ప్రమాదంపై అన్ని కోణాల్లో ముమ్మర దర్యాప్తు జరుగుతోంది. ఇబ్రహీం రైసీ వారసుడిని ఎన్నుకునేందుకు ఇరాన్‌లో అధ్యక్ష ఎన్నికలు జూన్ 28న జరుగుతాయని పేర్కొంటూ టెహ్రాన్ టైమ్స్‌లో సోమవారం ఓ కథనం ప్రచురితమైంది.  ప్రస్తుతానికి ఇరాన్ తాత్కాలిక అధ్యక్షుడిగా మహ్మద్ మొఖ్బర్, తాత్కాలిక విదేశాంగ మంత్రిగా అలీ బఘేరిని నియమించారు.

We’re now on WhatsApp. Click to Join

ఇరాన్ రాజ్యాంగం ఏం చెబుతోంది?

ఇస్లామిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్ ఇరాన్ రాజ్యాంగం ఆర్టికల్‌ 131 ప్రకారం.. దేశ అధ్యక్షుడు అకస్మాత్తుగా మరణిస్తే మొదటి ఉపాధ్యక్షుడు ఆ పదవిని చేపడతారు. అయితే దీనికి సుప్రీం లీడర్‌ ఖమేనీ ఆమోదం అవసరం. అనంతరం ఫస్ట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, పార్లమెంట్ స్పీకర్‌, న్యాయ శాఖ చీఫ్‌లతో కూడిన ఓ కౌన్సిల్‌ను ఏర్పాటు చేస్తారు. ఇది గరిష్ఠంగా 50 రోజుల్లోగా కొత్త అధ్యక్షుడి కోసం ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది. ఇరాన్ తాత్కాలిక అధ్యక్షుడు మహమ్మద్‌ మొఖ్‌బర్‌‌కు సుప్రీం లీడర్ ఖమేనీతో మంచి సంబంధాలే ఉన్నాయి. అంతర్జాతీయ లా అండ్ మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ పూర్తిచేసిన మొఖ్‌బర్.. గతంలో సెటాడ్ అనే శక్తివంతమైన ఇరాన్ ప్రభుత్వ యాజమాన్యంలోని ఫౌండేషన్‌కు నాయకత్వం వహించారు.

Also Read :BJP Candidates : బీజేపీ అభ్యర్థుల్లో ‘ఫిరాయింపు’ నేతలు ఎంతమంది తెలుసా ?

ఇరాన్‌లో సుప్రీం లీడరే చాలా ముఖ్యం. దేశీయ‌, విదేశీ వ్య‌వ‌హారాల్లో ఆయ‌నే ముఖ్య నిర్ణయాలన్నీ తీసుకుంటారు అధికారాల‌న్నీ సుప్రీం నేత ఆధీనంలోనే ఉంటాయి. మాజీ అధ్య‌క్షుడు హ‌స‌న్ రౌహ‌నీ, సుప్రీం నేత ఖ‌మేనీ మ‌ధ్య గ‌తంలో స‌రైన సంబంధాలు ఉండేవి కావు. కానీ అధ్య‌క్షుడు రైసీకి ఖ‌మేనీతో మంచి సంబంధాలు ఉండేవి. రైసీని సుప్రీం నేత‌గా తీర్చిదిద్దాల‌ని ఖ‌మేనీ ప్ర‌య‌త్నించినట్లు ఇరానియ‌న్లు భావించారు. ఈ పరిణామాలపై ఖమేనీ సహజ వారసుడైన కుమారుడు ముజ్తబా ఎలా స్పందించారు ? ఆయన ఎలాంటి వైఖరి తీసుకున్నారు ? అనేది ఎవరికీ తెలియదు. ఇరాన్ ఆర్మీ, అన్ని ప్రభుత్వ విభాగాలను ప్రభావితం చేసే శక్తి ఖమేనీ కుమారుడు ముజ్తబాకు ఉంది. సుప్రీం లీడర్ పోస్టు తనకు దక్కాలనే ఆశ ముజ్తబాకు మాత్రం ఉందా ? అనే ప్రశ్నలు ప్రస్తుతం తలెత్తుతున్నాయి. ఏదిఏమైనప్పటికీ ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రయీసీ(Ebrahim Raisi) హెలికాప్టర్ కూలడం.. ఆయనకు సెక్యూరిటీగా వెళ్లిన రెండు హెలికాప్టర్లు సేఫ్‌గా తిరిగి రావడం పలు అనుమానాలకు తావిస్తోంది.