Imran Khan : పాక్‌లో ఇమ్రాన్ సర్కారు.. అనుచరుల స్కెచ్ !?

Imran Khan : మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ జైలులో ఉన్నా.. పాకిస్తాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ గుర్తింపు రద్దయినా.. ఆయన అనుచరులు ఎన్నికల్లో సత్తాచాటిన విషయం అందరికీ తెలుసు.

  • Written By:
  • Updated On - February 20, 2024 / 09:04 AM IST

Imran Khan : మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ జైలులో ఉన్నా.. పాకిస్తాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ గుర్తింపు రద్దయినా.. ఆయన అనుచరులు ఎన్నికల్లో సత్తాచాటిన విషయం అందరికీ తెలుసు. పాక్ జాతీయ అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్లంతా స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసి విజయఢంకా మోగించారు.  నవాజ్ షరీఫ్‌కు చెందిన పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్ (PML-N), బిలావల్ భుట్టోకు చెందిన పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (PPP)లను మించిన రేంజ్‌లో జాతీయ అసెంబ్లీ స్థానాలను గెల్చుకున్నారు. పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్‌ పార్టీకి 76  సీట్లు, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీకి 54 సీట్లే వచ్చాయి. ఇమ్రాన్ అనుచరులు ఇండిపెండెంట్లుగా పోటీచేసి అత్యధికంగా 101 స్థానాలను కైవసం చేసుకున్నారు. ఇప్పుడు వారంతా ఒక కొత్త ప్లాన్  రెడీ చేశారు. అదేంటో తెలుసుకుందాం..

We’re now on WhatsApp. Click to Join

ఇమ్రాన్ ఖాన్ అనుచరులు 101 స్థానాల్లో గెలిచినప్పటికీ.. వాళ్లంతా ఇండిపెండెంట్లు కావడంతో ప్రభుత్వ ఏర్పాటుకు పోటీపడటానికి అనర్హులు. అందుకే తక్కువ సీట్లు గెలిచినప్పటికీ.. నవాజ్ షరీఫ్, బిలావల్ భుట్టో పార్టీలు ధీమాగా ప్రభుత్వ ఏర్పాటుకు రెడీ అవుతున్నాయి. ఈనేపథ్యంలో ఒక రాజకీయ పార్టీపై ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) అనుచరుల కన్ను పడింది. దానిపేరు.. సున్నీ ఇత్తెహాద్ కౌన్సిల్ (SIC). ఇది పాక్ ఎన్నికల సంఘం వద్ద రిజిస్టర్ అయిన రాజకీయ పార్టీ. ఇండిపెండెంట్లుగా పోటీ చేసి గెలిచిన ఇమ్రాన్ ఖాన్ అనుచరులంతా త్వరలోనే సున్నీ ఇత్తెహాద్ కౌన్సిల్‌లో చేరేందుకు రెడీ అవుతున్నారు. ఈ పార్టీలో చేరేందుకు సంబంధించిన అప్లికేషన్లను పాక్ ఎన్నికల సంఘానికి కూడా పంపించనున్నారు. పాక్ ఎన్నికల సంఘం ఆమోదం లభించిన వెంటనే వారంతా సున్నీ ఇత్తెహాద్ కౌన్సిల్ పార్టీ సభ్యులుగా మారుతారు. అదే జరిగితే పాక్ జాతీయ అసెంబ్లీలో అతిపెద్ద పార్టీగా సున్నీ ఇత్తెహాద్ కౌన్సిల్ ఆవిర్భవిస్తుంది. అనంతరం ప్రభుత్వ ఏర్పాటుకు పోటీపడే ఛాన్స్ కూడా వారికి దక్కుతుంది. ఈక్రమంలో ఇతర స్వతంత్ర అభ్యర్థులు,  ఒకటి, రెండు చిన్న రాజకీయ పార్టీలను కలుపుకొని ప్రభుత్వం ఏర్పాటు చేయాలనే ప్లాన్‌లో ఇమ్రాన్ ఖాన్ అనుచరులు ఉన్నారు.

Also Read : Group 1 : పాత అభ్యర్థుల సంగతేంటి ? గ్రూప్-1 కొత్త నోటిఫికేషన్ వివరాలేంటి ?

ప్రస్తుతం నిషేధాన్ని ఎదుర్కొంటున్న  ఇమ్రాన్ ఖాన్ పార్టీ  పీటీఐకి  ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్న ‌గోహర్ అలీ ఖాన్ కూడా ఈ వివరాలను ధ్రువీకరించారు. ‘‘సున్నీ ఇత్తెహాద్ కౌన్సిల్‌లో ఎన్నికల్లో గెలిచిన ఇమ్రాన్ అనుచరులంతా చేరబోతున్నారు. ఆ తర్వాత పాకిస్తాన్‌లోని చాలా ప్రావిన్స్‌లలో మాకు అధికారం లభిస్తుంది. తదుపరిగా మేం చక్కటి ప్రణాళికతో జాతీయ అసెంబ్లీలో మెజారిటీని నిరూపించుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం’’ అని పీటీఐ పార్టీ ప్రధాన మంత్రి అభ్యర్థి ఒమర్ అయూబ్ ఖాన్ తాజాగా మీడియా సమావేశంలో ప్రకటించారు. పాకిస్తాన్ దేశ రెండో అధ్యక్షుడు మహ్మద్ అయూబ్ ఖాన్ మనవడే ఈ ఒమర్ అయూబ్ ఖాన్.

Also Read :Farmers Vs Govt : రైతులతో కేంద్రం చర్చలు విఫలం.. 21 ఢిల్లీలోకి ప్రవేశిస్తామన్న రైతు సంఘాలు