Site icon HashtagU Telugu

Nuclear Bomb On Gaza : గాజాపై అణుబాంబు.. ఇజ్రాయెల్ మంత్రి సంచలన వ్యాఖ్యలు

Nuclear Bomb On Gaza

Nuclear Bomb On Gaza

Nuclear Bomb On Gaza : ఓ వైపు ఇజ్రాయెల్ ఆర్మీ దాడుల్లో వేలాది మంది గాజా పౌరులు చనిపోతుంటే.. మరోవైపు ఇజ్రాయెల్‌లోని అతివాద పార్టీల నాయకులు గాజాపై వాగ్యుద్ధం చేస్తున్నారు. ఈక్రమంలోనే ఇజ్రాయెల్ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న అతివాద పార్టీ  ఓజ్మా యెహూదీత్ (Otzma Yehudit)కు చెందిన హెరిటేజ్ మంత్రి అమిచాయ్ ఎలియాహు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గాజాపై అణుబాంబు వేసేందుకు సంబంధించిన ఒక ఆప్షన్ కూడా తమ ప్రభుత్వం ఎదుట సిద్ధంగా ఉందని ఆయన వెల్లడించారు.  రేడియో కోల్ బెరామాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమిచాయ్ ఈ సంచలన కామెంట్ చేశారు. ‘‘గాజాలోని వాళ్లు నాజీలలా వ్యవహరిస్తున్నారు. వారికి మానవతా సహాయాన్ని అందనివ్వబోం. గాజాలో అమాయక పౌరులు అంటూ ఎవరూ లేరు’’ అని ఆయన చెప్పారు.  గాజాకు సాయం చేయాలనే ఆలోచన రావడం కూడా తప్పు అని ఇజ్రాయెల్ హెరిటేజ్ మంత్రి అమిచాయ్ ఎలియాహు పేర్కొన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

‘‘గాజా భూభాగాన్ని స్వాధీనం చేసుకొని అక్కడ మా ఇజ్రాయెలీలకు కాలనీలను నిర్మిస్తాం. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్లిపోవాలనేది గాజా ప్రజలు నిర్ణయించుకోవాలి. వాళ్లు ఐర్లాండ్‌కు వెళ్లొచ్చు లేదంటే ఎడారులకు వెళ్లొచ్చు. దీనికి గాజాలో ఉన్న రాక్షసులే ఒక పరిష్కారాన్ని తయారు చేసుకోవాలి’’ అని ఇజ్రాయెల్ హెరిటేజ్ మంత్రి అమిచాయ్ ఎలియాహు స్పష్టం చేశారు. ‘‘గాజాలో ఎవరైనా పాలస్తీనా లేదా హమాస్ జెండాను ఊపుతూ భూమిపై జీవించడం అనేది ఇక కుదరదు’’ అని ఆయన(Nuclear Bomb On Gaza) తేల్చి చెప్పారు.

Also Read: 100% FDI- First Project : భారత్‌లో స్వీడన్ రాకెట్ల ప్లాంట్.. తొలిసారి 100 శాతం ఎఫ్‌డీఐ