Site icon HashtagU Telugu

600 Trash Balloons : ఉత్తర కొరియా ‘చెత్త’ వేధింపులు.. దక్షిణ కొరియా బార్డర్‌లో కలకలం

600 Trash Balloons

600 Trash Balloons

600 Trash Balloons : ఉత్తర కొరియా కవ్వింపు చర్యలు ఆగడం లేదు. దక్షిణ కొరియాను వీర రేంజులో అది రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది. ఇటీవలే కొన్ని చెత్త బెలూన్లను దక్షిణ కొరియాలోకి పంపిన ఉత్తరకొరియా.. ఇప్పుడు మరోసారి ఆ ప్రయత్నాన్ని రిపీట్ చేసింది.  తాజాగా శనివారం రాత్రి నుంచి ఆదివారం వరకు దాదాపు 600 చెత్త బెలూన్లు(600 Trash Balloons) ఉత్తర కొరియా నుంచి వచ్చి దక్షిణ కొరియాలో పడ్డాయి. ఆ బెలూన్లు పడిన ప్రాంతాల్లో దక్షిణ కొరియా ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. ఆ చెత్త బెలూన్లను సేకరించి.. వాటిలోని చెత్త శాంపిళ్లను ల్యాబ్‌కు తరలించారు. వాటిలో ఏవైనా హానికారక పదార్థాలు ఉన్నాయా అనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఉత్తర కొరియా పంపిన చెత్త బెలూన్లలో సిగరెట్ పీకలు, స్క్రాప్‌లు, వ్యర్థ కాగితం, వినైల్ వంటివి ఉన్నాయి. ప్రమాదకరమైన పదార్థాలు లేవని అంటున్నారు.

We’re now on WhatsApp. Click to Join

ఉత్తర కొరియా పంపే చెత్త బెలూన్లను తాకొద్దని సరిహద్దు ప్రాంతాల ప్రజలకు దక్షిణ కొరియా సూచించింది. ఆ బెలూన్లు పడిన వెంటనే సైన్యానికి సమాచారాన్ని అందించాలని నిర్దేశించింది. సైన్యం, పోలీసులు, ఫోరెన్సిక్ విభాగాలు కలిసి ఈ చెత్త బెలూన్లను పర్యవేక్షిస్తుంటాయని వెల్లడించింది. ఇక దక్షిణ కొరియా రాజధాని సియోల్‌ నగరానికి సమీపంలోకి కూడా కొన్ని ఉత్తర కొరియా చెత్త బెలూన్లు వెళ్లాయని తెలుస్తోంది. గత మంగళవారం రాత్రి నుంచి బుధవారం వరకు కూడా దక్షిణ కొరియాలోకి 260 చెత్త బెలూన్లను ఉత్తర కొరియా పంపింది. అప్పట్లో ఆ బెలూన్లను తనిఖీ చేయడానికి ఏకంగా బాంబు స్క్వాడ్‌ను రంగంలోకి దింపారు. ఎలాంటి రిస్క్ లేదని తెలియడంతో వాటిని చెత్త డంపింగ్ యార్డుకు తరలించారు. ఇలాంటి చెత్త బెలూన్లలో ఉత్తర కొరియా రసాయన, జీవ, రేడియోధార్మిక పదార్థాలను పంపే ముప్పు ఉందనే ఆందోళన కూడా వ్యక్తమవుతోంది.

Also Read : Rahul Gandhi : గెలిచేది మేమే.. అవి మోడీ పోల్స్‌ : రాహుల్ గాంధీ