Nokia: యూపీఐ, యూట్యూబ్‌తో 3 నోకియా ఫీచర్ ఫోన్లు

నోకియా ఫోన్లు అంటే మామూలు విషయం కాదు. ఒకప్పుడు వీటిని వినియోగించని వారంటూ లేరు.

  • Written By:
  • Updated On - June 26, 2024 / 08:13 AM IST

Nokia: నోకియా ఫోన్లు అంటే మామూలు విషయం కాదు. ఒకప్పుడు వీటిని వినియోగించని వారంటూ లేరు. తర్వాతి కాలంలో శాంసంగ్‌తో పోటీని తట్టుకోలేక నోకియా చతికిలపడింది. ఇప్పుడు మళ్లీ మార్కెట్లో ప్రజాదరణ కోసం నోకియా నానా ప్రయత్నాలు చేస్తోంది. హెచ్‌ఎండీ గ్లోబల్ అనే కంపెనీ  ప్రస్తుతం నోకియా ఫోన్లను తయారు చేస్తోంది. తాజాగా నోకియా 235 4జీ, నోకియా 220 4జీ  మోడళ్లను నోకియా విడుదల చేసింది. ఈ ఫోన్లలో ప్రజలకు ఎంతో ఇష్టమైన యూట్యూబ్, యూట్యూబ్ మ్యూజిక్ ఫీచర్లను ఇన్‌బిల్ట్‌గా అందిస్తున్నారు. ఇక అత్యంత కీలకమైన  యూపీఐ పేమెంట్ ఫీచర్‌‌ కూడా ఈ ఫోన్లలో ఇన్‌బిల్ట్‌గా వస్తుంది. 25 ఏళ్ల సుదీర్ఘ గ్యాప్ తర్వాత నోకియా 3210 ఫోన్ మోడల్‌ను ఇప్పుడు విడుదల చేయడం విశేషం. దీనిలోనూ పైన మనం చెప్పుకున్న కొత్త ఫీచర్లు ఉన్నాయి. ఈ మూడు ఫోన్లు కూడా హెచ్‌ఎండీ, అమెజాన్‌తో పాటు ఇతర రిటైల్‌ దుకాణాల్లోనూ లభిస్తాయి.

We’re now on WhatsApp. Click to Join

నోకియా 235 ఫోన్ గురించి.. 

  • నోకియా 235 4జీ ఫోనులో 2.8 అంగుళాల ఐపీఎస్‌ డిస్‌ప్లే ఉంటుంది.
  • ఈ  ఫోనులో  2 ఎంపీ కెమెరాను అమర్చారు.
  • నోకియా 235  ఫోను ధర రూ.3,749.
  • బ్లూ, బ్లాక్‌, పర్పల్‌ రంగుల్లో లభిస్తుంది.
  • ఇందులో యూట్యూబ్‌, యూట్యూబ్‌ మ్యూజిక్‌, యూపీఐ ఫీచర్లు ఉంటాయి.

నోకియా 220 4జీ  ఫోను గురించి.. 

  • నోకియా 220 4జీ  ఫోను ధర రూ.3,249.
  • ఈ ఫోన్‌ టైప్‌-సి ఛార్జింగ్‌ పోర్ట్‌తో  వస్తుంది.
  • పీచ్‌, బ్లాక్‌ రంగుల్లో లభిస్తుంది.
  • ఇందులో యూట్యూబ్‌, యూట్యూబ్‌ మ్యూజిక్‌, యూపీఐ ఫీచర్లు ఉంటాయి.

నోకియా 3210 మళ్లీ వచ్చేసింది.. 

  • నోకియా 3210 ఫోన్ మోడల్‌ను కూడా నోకియా  తాజాగా విడుదల చేసింది.
  • నోకియా 3210 ఫోన్‌లో 1450 mAh బ్యాటరీ ఉంటుంది.
  • స్నేక్‌ గేమ్‌, 2ఎంపీ కెమెరా, ఫ్లాష్‌ టార్చ్‌ సదుపాయం ఉంటాయి.
  • యూట్యూబ్‌, యూట్యూబ్‌ మ్యూజిక్‌తో పాటు వెదర్‌, న్యూస్‌, క్రికెట్‌ స్కోర్‌, 2048 గేమ్‌తో సహా 8 యాప్స్‌‌ను ఈ ఫోనులో ఇచ్చారు.
  • యూపీఐ పేమెంట్లు చేయొచ్చు. క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేసి పేమెంట్ చేసే ఛాన్స్ ఉంటుంది.
  • నోకియా 3210 ఫోను ధర రూ.3,999.
  • స్కూబా బ్లూ, బ్లాక్‌, Y2k గోల్డ్‌ రంగుల్లో ఈ ఫోను లభిస్తుంది.