Site icon HashtagU Telugu

Chrome – Warning : గూగుల్ క్రోమ్‌ యూజర్స్‌కు ప్రభుత్వం వార్నింగ్

Google Chrome Ai

Google Chrome Ai

Chrome – Warning : గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌ను ఉపయోగించే యూజర్లకు ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) తాజాగా ఒక హెచ్చరికను జారీ చేసింది. ఈ బ్రౌజర్‌లో కొన్ని సైబర్ బలహీనతలను గుర్తించామని వెల్లడించింది. ఆ బలహీనతలను ఆధారంగా చేసుకొని హ్యాకర్లు.. గూగుల్ క్రోమ్‌ యూజర్లకు తెలియకుండానే వారి బ్రౌజర్లలోకి సీక్రెట్‌ కోడ్‌ను చొప్పించగలుగుతారని  ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ తెలిపింది. ఆ సీక్రెట్ కోడ్ ద్వారా కొన్ని ప్రమాదకర వెబ్‌సైట్లలోకి గూగుల్ క్రోమ్  యూజర్స్‌ను దారిమళ్లించి.. అక్కడి నుంచి వారి సమాచారాన్ని దొంగిలించే ముప్పు ఉందని వార్నింగ్ ఇచ్చింది.

We’re now on WhatsApp. Click to Join.

ప్రత్యేకించి గూగుల్ క్రోమ్(Chrome – Warning) డెస్క్‌టాప్ వర్షన్‌లో ఎక్కువ బలహీనతలను గుర్తించామని పేర్కొంది. ‘‘డెస్క్‌టాప్‌ సిస్టమ్‌లకు అమర్చే వెబ్ కెమెరాలలో వాడే మీడియా స్ట్రీమ్ సాఫ్ట్‌వేర్‌తో పాటు సైడ్ ప్యానెల్ సెర్చ్, మీడియా క్యాప్చర్, ఆటో ఫిల్, బ్రౌజర్ యూఐ వంటి వాటిని సక్రమంగా వినియోగించకపోవడంతో గూగుల్ క్రోమ్‌లో బలహీనతలు తలెత్తుతున్నాయి’’ అని పేర్కొంటూ ఈ ఏడాది సెప్టెంబర్‌లో కూడా ఒక వార్నింగ్‌ను CERT-In భారతీయ వినియోగదారులకు జారీ చేసింది.

Also Read: Pension 3000 : పెన్షన్ రూ.3వేలకు పెంపు.. నేడే కీలక నిర్ణయం