Nepal PM Wife Passes Away: నేపాల్ ప్రధాని పుష్పకమల్ దహల్ ‘ప్రచండ’ భార్య బుధవారం (జూలై 12) (Nepal PM Wife Passes Away) కన్నుమూశారు. సమాచారం ప్రకారం.. దీర్ఘకాల అనారోగ్యంతో బాధపడుతున్న నేపాలీ ప్రధాని భార్య సీతా దహల్ గుండెపోటుతో మరణించారు. వార్తా సంస్థ ANI ప్రకారం.. PM ప్రచండ భార్య నార్విక్ ఇంటర్నేషనల్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆసుపత్రి విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. సీతా దహల్‌కు మధుమేహం, రక్తపోటుతో సహా అనేక వ్యాధులు ఉన్నాయి. వాటికి చికిత్స పొందుతూ జూలై 12న ఉదయం 8 గంటలకు సీతా దహల్ తుది శ్వాస విడిచినట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. రెండేళ్ల క్రితం పుష్ప్ కమల్ దహల్ ప్రచండ కూడా తన భార్యకు వైద్యం చేయించుకునేందుకు ముంబై వచ్చాడు. అతని భార్య సీతా దహల్ చాలా కాలంగా అనారోగ్యంతో ఉన్నారు. ఆమె పార్కిన్సన్స్ లాంటి లక్షణాలతో బాధపడుతోంది.
Sita Dahal, wife of Nepal PM Pushpa Kamal Dahal 'Prachanda', passed away today after suffering a cardiac arrest following prolonged illness. pic.twitter.com/zqLL9FJTlN
— ANI (@ANI) July 12, 2023