Helicopter Drop-Chandrayaan 3 : “చంద్రయాన్ 2” మిషన్ లో ఎదురైన వైఫల్యం నుంచి పాఠాలను నేర్చుకొని జూలై 14న(గురువారం) “చంద్రయాన్-3” మిషన్ కోసం ఇస్రో రెడీ అయింది. “చంద్రయాన్ 2” మిషన్ లో 2019 సెప్టెంబర్ 6న చంద్రుడి దక్షిణ ధృవంపై ల్యాండింగ్ అయ్యే క్రమంలో టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చి ల్యాండర్ “విక్రమ్” కూలిపోయింది. “చంద్రయాన్-3” మిషన్ లో ఆ ప్రాబ్లమ్స్ ఎదురుకాకుండా చూసేందుకు శాస్త్రవేత్తలు గత నాలుగేళ్లుగా శ్రమిస్తున్నారు. ప్రత్యేకించి ల్యాండర్ ను చంద్రుడిపై సేఫ్ గా ల్యాండ్ అయ్యేలా సిద్ధం చేశారు. ఇప్పుడు “చంద్రయాన్-3” మిషన్ లో వాడుతున్న ల్యాండర్ పేరు కూడా “విక్రమ్”. గత వైఫల్యం నేపథ్యంలో ల్యాండర్ ను ఇస్రో ఇంకా బెటర్ గా తయారు చేసింది. ఏకంగా హెలికాప్టర్ నుంచి కిందికి ల్యాండర్ “విక్రమ్”ను జారవిడిచి మరీ టెస్ట్ చేసింది. ఎలాంటి గరుకు ఉపరితలంలో ల్యాండ్ అయినా దెబ్బతినకుండా ఉండేలా.. ల్యాండర్ లోని 6 చక్రాలను(వీల్స్) బాగా స్ట్రాంగ్ గా తయారు చేశారు. చంద్రయాన్ 2 ల్యాండర్ సెకనుకు 2 మీటర్ల వేగంతో చంద్రుడి ఉపరితలాన్నితాకే సామర్ధ్యాన్ని కలిగి ఉండగా.. ఇప్పుడు చంద్రయాన్ 3 ల్యాండర్(Helicopter Drop-Chandrayaan 3) సెకనుకు 3 మీటర్ల వేగంతో ఉపరితలాన్నితాకే సామర్ధ్యాన్ని కలిగి ఉంది.
ప్రొపల్షన్ సిస్టమ్‌లో సాంకేతిక సమస్య లేకుండా..
“చంద్రయాన్ 2” మిషన్ సందర్భంగా ల్యాండర్ లోని ప్రొపల్షన్ సిస్టమ్‌లో సాంకేతిక సమస్య ఏర్పడి.. చంద్రుడిపై ల్యాండింగ్ సమయంలో ఉండాల్సిన స్పీడ్ చాలా ఎక్కువై పోయింది. ఫలితంగా దాన్ని ఇస్రో కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి కంట్రోల్ చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఈసారి ఆ మిస్టేక్ రిపీట్ కాకుండా ఇస్రో శాస్త్రవేత్తల టీమ్ అన్ని జాగ్రత్తలు తీసుకుంది. చంద్రయాన్-3 ల్యాండర్ “విక్రమ్”లో అన్ని వైపులా సోలార్ ప్యానెల్స్ ను అమర్చారు. ల్యాండర్ తో కోల్డ్ సిమ్యులేషన్ పూర్తయింది. దాని ఇంధన ట్యాంక్ సామర్థ్యాన్ని పెంచారు. తద్వారా ప్రాధమిక ల్యాండింగ్ సైట్లో సమస్య ఉంటే.. మరో సైట్లో ల్యాండింగ్ కోసం కూడా అదనపు ఇంధనం ల్యాండర్ లో మిగిలి ఉంటుంది. దాని సాఫ్ట్వేర్ ను కూడా మెరుగుపరిచారు.
Also read : AP Cabinet Meeting : నేడు ఏపీ కెబినెట్ భేటీ.. వివిధ కీలకాంశాలపై చర్చించనున్న మంత్రివర్గం
ల్యాండర్ విక్రమ్ చంద్రుడిపై దిగగానే ఏం జరుగుతుంది ?
ల్యాండర్ “విక్రమ్” లోపల రోవర్ “ప్రజ్ఞాన్” సహా మొత్తం 5 పరికరాలు ఉంటాయి. ల్యాండర్ విక్రమ్ చంద్రుడిపై దిగగానే .. ల్యాండర్ తలుపులు తెరుచుకుంటాయి. అందులో నుంచి రోవర్ “ప్రజ్ఞాన్” బయటకు పాకుతూ వెళ్తుంది. ఆ రోవర్ పరిసర ప్రాంతాల్లో తిరుగుతూ సమాచారాన్ని సేకరించి .. దాన్ని ఎలక్ట్రానిక్ సిగ్నల్స్ గా మార్చి ల్యాండర్ విక్రమ్ కు పంపుతుంది. ల్యాండర్ నుంచి ఆర్బిటర్‌కు సమాచారం బదిలీ అవుతుంది. ఆర్బిటర్ నుంచి ఇస్రోకు ఎలక్ట్రానిక్ సిగ్నల్స్ అందుతాయి. చంద్రుడిపై ఉన్న ఉష్ణోగ్రత, నేల స్వభావం, నీటి వనరుల లభ్యత, వాతావరణంలో ఉన్న మూలకాలు, వాయువుల సమాచారాన్ని చంద్రయాన్ 3 మిషన్ ద్వారా ఇస్రో సేకరించనుంది.