Neeraj Chopra: భారత స్టార్ జావెలిన్ త్రో అథ్లెట్ నీరజ్ చోప్రా (Neeraj Chopra) డైమండ్ లీగ్ 2023 ఫైనల్ (Diamond League Final)లో రెండో స్థానంలో నిలిచాడు. రెండో స్థానంలో ఉండటంతో భారత ఆటగాడికి రజత పతకం లభించింది. కాగా, చెక్ రిపబ్లిక్‌కు చెందిన జాకుబ్ వడ్లెచ్ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. నీరజ్ చోప్రా 83.80 మీటర్లు విసిరాడు. ఫైనల్‌లో నీరజ్ చోప్రా సాధించిన అత్యుత్తమ స్కోరు ఇదే. అయితే భారత అథ్లెట్ 83.80 మీటర్లకు మించి విసరలేకపోయాడు. చెక్ రిపబ్లిక్‌కు చెందిన జాకుబ్ వడ్లెచ్ తన చివరి ప్రయత్నంలో జావెలిన్‌ను 84.27 మీటర్లు విసిరాడు. ఈ విధంగా జాకుబ్ వడ్లెచ్ గోల్డ్ మెడల్ సాధించడంలో సఫలమయ్యాడు.
Well played, champ! 🥈👏#NeerajChopra hits an 83.80 meter throw and yet misses 🥇 by a whisker!#JioCinema #Sports18 #DiamondLeague pic.twitter.com/lysMGOd0rI
— Sports18 (@Sports18) September 16, 2023
ఫిన్లాండ్‌కు చెందిన ఆలివర్ హెలాండర్ జావెలిన్‌ను 83.74 మీటర్లు విసిరాడు. ఈ విధంగా ఆలివర్ హెలాండర్ మూడో స్థానంలో నిలిచాడు. నిజానికి డైమండ్ లీగ్ ఫైనల్‌లో నీరజ్ చోప్రా ఫామ్‌లో కనిపించలేదు. మొదటి 2 ప్రయత్నాల్లో నీరజ్ చోప్రా స్కోరు చేయలేకపోయాడు. దీని తర్వాత నీరజ్ చోప్రా మిగిలిన 4 ప్రయత్నాల్లో 83.80 మీటర్ల దూరం సాధించాడు. చెక్ రిపబ్లిక్‌కు చెందిన జాకుబ్ వడ్లెచ్ తొలి ప్రయత్నంలోనే 84.1 మీటర్ల దూరం సాధించి నీరజ్ చోప్రాపై ఆధిక్యంలో నిలిచాడు.
జాకుబ్ వడ్లెచ్ ఆరో ప్రయత్నంలో 84.27 మీటర్ల దూరం సాధించి మొదటి స్థానం సాధించాడు. ఈ విధంగా భారత వెటరన్ నీరజ్ చోప్రా తన టైటిల్‌ను కాపాడుకోలేకపోయాడు. నీరజ్ చోప్రా టైటిల్‌ను కాపాడుకోవడంలో విజయం సాధించి ఉంటే నీరజ్ వరసగా గోల్డ్ మెడల్ సాధించిన ఆటగాడిగా.. ప్రపంచంలోనే మూడవ జావెలిన్ త్రోయర్‌గా నిలిచేవాడు. కానీ అది జరగలేదు. వాస్తవానికి గత ఏడాది సెప్టెంబర్‌లో జ్యూరిచ్‌లో జరిగిన డైమండ్ లీగ్ ఫైనల్‌లో నీరజ్ చోప్రా విజయం సాధించగా, ఈసారి ఆ ఫీట్‌ను పునరావృతం చేయడంలో విఫలమయ్యాడు.
ఫైనల్‌లో ఏ అథ్లెట్ జావెలిన్‌ను ఎంత దూరం విసిరాడు?
1. జాకుబ్ వడ్లెచ్ (చెక్ రిపబ్లిక్) – 84.24 మీటర్లు
2. నీరజ్ చోప్రా (భారతదేశం) – 83.80 మీటర్లు
3.ఒలివర్ హెలాండర్ (ఫిన్లాండ్) – 83.74 మీటర్లు
4.ఆండ్రియన్ మర్దారే (మోల్డోవా)- 81.79 మీటర్లు
5.కర్టిస్ థాంప్సన్ (USA)- 77.01 మీ