Compulsory Military Service : మయన్మార్ జుంటా ఆర్మీకి మిలిటెంట్ గ్రూపుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. ఇప్పటికే ఇండియా, చైనా దేశాల బార్డర్‌లోని మయన్మార్ చెక్ పోస్టులను మిలిటెంట్ గ్రూపులు స్వాధీనం చేసుకున్నాయి. దీంతో మయన్మార్ ఆర్మీ తీవ్ర సంక్షోభంలో పడింది. దానికి సైనికుల కొరత కూడా ఏర్పడింది. చాలామంది యువత మయన్మార్ ఆర్మీ నుంచి బయటికొచ్చి మిలిటెంట్ గ్రూపుల్లో చేరిపోతున్నారు.ఈ నేపథ్యంలో మయన్మార్ జుంటా ఆర్మీ కీలక నిర్ణయం తీసుకుంది.
We’re now on WhatsApp. Click to Join
దేశంలోని యువత తప్పకుండా మిలిటరీలో పనిచేయాలని మార్గదర్శకాలను విడుదల చేసింది. 18-35 ఏళ్లలోపు వయస్సు కలిగిన పురుషులు, 18-27 ఏళ్లలోపు వయస్సు కలిగిన స్త్రీలు కనీసం రెండేళ్ల పాటు మిలిటరీలో పనిచేయాలని నిర్దేశిస్తూ ‘‘పీపుల్స్ మిలిటరీ సర్వీస్ చట్టాన్ని’’(Compulsory Military Service) అమల్లోకి తెచ్చింది. ఫిబ్రవరి 10 నుంచే ఈ చట్టం అమలుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను జారీ చేసింది. మిలిటెంట్ల తిరుగుబాటును అణచివేసేందుకే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని మయన్మార్ ఆర్మీ వెల్లడించింది.
Also Read : Happy Promise Day : నేడే ‘ప్రామిస్ డే’.. వాగ్దానం చేసేయండి.. గిఫ్టులు ఇచ్చేయండి
వాస్తవానికి ‘‘పీపుల్స్ మిలిటరీ సర్వీస్ చట్టాన్ని’’ 2010 సంవత్సరంలోనే మిలిటరీ జుంటా రూపొందించింది. కానీ అమల్లోకి తెచ్చింది మాత్రం ఇప్పుడే. రెండేళ్ల పాటు మయన్మార్ యువత ఇకపై తప్పకుండా ఆర్మీలో పనిచేయాలి. దేశ అవసరాలను బట్టి ఈ వ్యవధిని ఐదేళ్లకు పొడిగించాలనే నిబంధన కూడా ఇందులో ఉంది. మయన్మార్ జుంటా 2021లో దేశ అధికారాన్ని కైవసం చేసుకుంది. నాటి నుంచి దేశంలో అత్యవసర పరిస్థితి అమల్లో ఉంది. తాజాగా ఆ అత్యవసర పరిస్థితిని మరో ఆరు నెలల పాటు పొడిగించింది.
Also Read :Electoral Bonds : 10 రెట్లు పెరిగిన టీడీపీ విరాళాలు.. నంబర్ 1 బీజేపీ
ఇజ్రాయెల్ ఆర్మీలో గుజరాతీలు.. అక్కడ కూడా ‘కంపల్సరీ’
ఇజ్రాయెల్-హమాస్ గాజా సరిహద్దుల్లో భీకరంగా సాగుతున్న పోరులో భారతీయులు కూడా భాగస్వాములుగా ఉన్నారు. ఇజ్రాయెల్‌లో హమాస్ ఉగ్రవాదులతో పోరాడుతున్న సైనికుల్లో ఇద్దరు గుజరాతీ బిడ్డలు నిషా ములియాసియా, రియా ములియాసియా ఉన్నారు. గుజరాతీ మూలాలు కలిగిన ఈ ఇద్దరు యువతులు ఇజ్రాయెల్ ఆర్మీలో ఉన్నారు. గుజరాత్ కు చెందిన జీవాభాయ్ ములియాసియా మరియు సావ్దాసభాయి ములియాసియా బంధువులు. ఈ ములియాసియాలు గుజరాత్ లోని జునాగఢ్‌లోని మానవ్దార్ తాలూకాలో కొతాడి గ్రామ వాసులు. చాలా సంవత్సరాల క్రితం వీరి కుటుంబం ఇజ్రాయెల్‌లో స్థిరపడింది. వీరు ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్‌లో కిరాణా దుకాణం నడుపుతున్నారు. వీరి కుమార్తెలు నిషా ములియాసియా , రియా ములియాసియా ఇజ్రాయెల్ సైన్యంలో పనిచేస్తున్నారు. ఇజ్రాయెల్ లో తప్పనిసరి సైనిక సేవా విధానంలో భాగంగా వీరిద్దరూ సైన్యంలో చేరారు. ఇజ్రాయెల్ విద్యావిధానం పిల్లల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తుందని వీరి తండ్రి చెప్తున్నారు. నిషా రెండేళ్లుగా లెబనాన్, సిరియా, జోర్డాన్, ఈజిప్ట్ సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తోంది. ప్రస్తుతం ఆమె ఇజ్రాయెల్ దళాలు గాజాలో హమాస్‌పై దాడి చేస్తున్న యుద్ధభూమి అయిన గుష్ డెన్‌లో పనిచేస్తోంది. ఇజ్రాయెల్‌లో పెద్ద సంఖ్యలో గుజరాతీ ప్రజలు నివసిస్తున్నారు. వ్యాపారం, విద్య, ఉపాధి ఇలా రకరకాల కారణాలతో వీరంతా ఇజ్రాయెల్‌కు వలస వెళ్లారు. ఇజ్రాయెల్ చట్టాల ప్రకారం మగ, ఆడ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కనీసం 24 నుండి 32 నెలల పాటు సైన్యంలో పనిచేయాలి. దీంతో భారత్ నుంచి వెళ్లిన ములియాసియా కుటుంబానికి చెందిన ఇద్దరు అమ్మాయిలు రియా, నిషా సైన్యంలో చేరి విధులు నిర్వర్తిస్తున్నారు.