Plane Door Horror : ఇటీవల అమెరికాలోని అలాస్కా ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 737 మ్యాక్స్9 మోడల్ విమానం కిటికీ తలుపు ఊడిపోవడం కలకలం క్రియేట్ చేసింది. దానిపై దర్యాప్తు చేయగా ఊడిపోయిన కిటికీ తలుపు ప్లగ్ పోర్ట్లాండ్ ప్రాంతంలోని బారెన్స్ రోడ్లో ఉన్న బాబ్ అనే టీచర్ పెరట్లో పడిందని వెల్లడైంది. తన పెరట్లో విమానంలోని భాగమొకటి పడిన విషయాన్ని బాబ్ స్వయంగా విమానం ఎంక్వైరీ టీమ్‌కు తెలియజేశారు. ఈ ప్లగ్ బరువు దాదాపు 30 కిలోలు ఉంటుంది. కిటికీ ఊడిపోగానే.. ఆ కిటికీ పక్కన కూర్చున్న ఓ ప్రయాణికుడికి చెందిన ఐఫోన్ కూడా 16వేల అడుగుల ఎత్తు నుంచి పడిపోయింది. అయినా ఐఫోన్ వర్క్ చేస్తోందని.. దాని బ్యాటరీ ఇంకా సగం మిగిలే ఉందని ఎంక్వైరీ టీమ్ గుర్తించడం విశేషం.
We’re now on WhatsApp. Click to Join.
అలాస్కా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం గత శుక్రవారం రాత్రి అమెరికాలోని పోర్ట్లాండ్ నుంచి అంటారియోకు 174 మంది ప్రయాణికులతో బయలుదేరింది. విమానం రన్ వే నుంచి టేకాఫ్ అయ్యాక 16 వేల అడుగుల ఎత్తులో కిటికీ తలుపు(Plane Door Plug) ఊడిపోయింది. ఈ ఘటనలో కొందరు గాయపడ్డారు. ఈ ప్రమాదంపై దర్యాప్తు ఇంకా జరుగుతోంది. కిటికీ తలుపు ఊడిపోయిన అలాస్కా ఎయిర్‌లైన్స్‌కు చెందిన 1282 నంబరు విమానంలో మరో లోపం కూడా బయటపడింది. ఈ విమానం కాక్‌పీట్ వాయిస్ రికార్డర్లో డేటా ఓవర్ రైడ్ అయిందని నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ బృందం గుర్తించింది. దీన్ని సరైన టైంలో ఆఫ్ చేయకపోవడమే ఇందుకు కారణమని తెలిపారు.
Also Read: Vijayashanthi : హిందీ భాషా వివాదం.. విజయ్ సేతుపతికి విజయశాంతి సపోర్ట్.. ఏమన్నారంటే..
ఆదివారం విమానం నుంచి కాక్‌పీట్ వాయిస్ రికార్డర్‌ను స్వాధీనం చేసుకోవడంతో ఈ విషయం వెల్లడైంది. ఈ ఘటన నేపథ్యంలో అమెరికాలో వినియోగంలో ఉన్న బోయింగ్ 737 మ్యాక్స్9 మోడల్‌కు చెందిన దాదాపు 200 విమానాల్లో తనిఖీలు జరిగాయి. భారతదేశంలో ఈ మోడల్‌కు చెందిన విమానాలు వినియోగంలో లేవని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ప్రకటించింది. అయినప్పటికీ ముందుజాగ్రత్త చర్యగా భారత విమానయాన సంస్థలు వాడుతున్న బోయింగ్ కంపెనీ విమానాలను తనిఖీ చేయించామని వెల్లడించింది. కిటికీలు, బోల్టులు ఇతర భాగాలను మరోసారి వేరిఫై చేయించామని చెప్పింది. భారత ప్రయాణికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, భద్రతాపరమైన అంశాలలో తాము రాజీపడబోమని డీజీసీఏ తేల్చి చెప్పింది. విమానయాన సంస్థలను నిరంతరం తాము పర్యవేక్షిస్తూనే ఉంటామని వెల్లడించింది.