Mega Hero యువ హీరోల్లోనే కాదు స్టార్ హీరోల్లో కూడా ఒకరి కథ మరొకరి దగ్గరకు వెళ్లడం చూస్తుంటాం. స్టార్ హీరోలు కథ వర్క్ అవుట్ అవ్వదనో లేక డెట్స్ లేవనో చెప్పి కొన్ని సినిమాలు మిస్ చేసుకుంటారు. ఐతే అలాంటి కథలు వేరే హీరోలు చేసి హిట్ కొడుతుంటారు. ఇప్పుడు మెగా హీరో చేయాల్సిన ఒక ప్రాజెక్ట్ వేరే హీరొ దగ్గరకు వెళ్లినట్టు తెలుస్తుంది. ఇంతకీ ఎవరా మెగా హీరో ఏంటా కదా అంటే.. మెగా మేనల్లుడు సాయి తేజ్ (Sai Tej) బ్రో తర్వాత రోహిత్ అనే కొత్త దర్శకుడితో ఈమధ్యనే సినిమా ప్రకటించాడు.
ఐతే ఆ సినిమా కన్నా ముందు సంపత్ నంది (Sampat Nandi) డైరెక్షన్ లో గాంజా శంకర్ సినిమా చేయాల్సి ఉంది. సితార బ్యానర్ లో ఈ సినిమా గ్లింప్స్ కూడా వదిలారు. కానీ కట్ చేస్తే సినిమా క్యాన్సిల్ అయ్యింది. బడ్జెట్ ఇష్యూస్ వల్ల సాయి తేజ్ సినిమా ఆగిపోయిందని తెలుస్తుంది. ఐతే ఇప్పుడు ఆ డైరెక్టర్ ఆ కథను మరో హీరోతో చేస్తున్నాడని తెలుస్తుంది.
మెగా హీరో కాదన్న కథను మరో యువ హీరో శర్వానంద్ చేసే ఛాన్స్ ఉందని టాక్. ఆల్రెడీ శర్వానంద్ (Sharwanand) కు సంపత్ నంది కథ చెపడం అతను ఓకే అనడం జరిగిందట. ఐతే అది సాయి తేజ్ కథతోనే వీరి సినిమా వస్తుందా లేదా అన్నది మాత్రం తెలియాల్సి ఉంది. సాయి తేజ్ మాత్రం రోహిత్ డైరెక్షన్ లో సినిమాను నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్ తో వస్తున్నాడు.
ఇక శర్వానంద్ కూడా సమ్మర్ లో మనమే అంటూ వచ్చాడు. ఐతే తన నెక్స్ట్ సినిమా హిట్ టార్గెట్ తో రావాలని ఫిక్స్ అయిన శర్వానంద్ అందుకు తగిన ప్లానింగ్ చేస్తున్నాడు.
Also Read : Nothing Phone 2a Plus: తక్కువ ధరకే అద్భుతమైన ఫీచర్లతో ఆకట్టుకుంటున్న నథింగ్ ఫోన్.. ప్రత్యేకతలు ఇవే!