45 People Burned Alive : 40 మంది భారతీయులు సజీవ దహనం.. కువైట్‌లో అగ్నిప్రమాదం

ప్రపంచంలోనే అత్యధిక కరెన్సీ విలువ కలిగిన దేశం కువైట్‌. 

  • Written By:
  • Updated On - June 12, 2024 / 06:25 PM IST

45 People Burned Alive : ప్రపంచంలోనే అత్యధిక కరెన్సీ విలువ కలిగిన దేశం కువైట్‌.  ఆ దేశంలో ఘోర ప్రమాదం జరిగింది. బుధవారం ఉదయం దక్షిణ మంగాఫ్‌ జిల్లాలోని ఆరు అంతస్తుల భవనంలో భారీగా మంటలు చెలరేగాయి. ఈ మంటలు వెంటనే అదుపులోకి రాకపోవడంతో భారీ ప్రాణనష్టం జరిగింది. ఆ భవనంలో నివసిస్తున్న దాదాపు 45 మంది(41 People Burned Alive)   సజీవ దహనమయ్యారు.

We’re now on WhatsApp. Click to Join

ఈ ప్రమాదంలో సజీవ దహనమైన వారిలో దాదాపు 40 మంది భారతీయులేనని తెలుస్తోంది. మరో  50 మంది తీవ్ర గాయాలతో ఆస్పత్రుల్లో చేరారని అక్కడి మీడియాలో కథనాలు వస్తున్నాయి. జీవనోపాధి కోసం సొంతూళ్లను వదిలి వచ్చి.. కువైట్‌లోని ఓ కంపెనీలో వీరంతా కలిసి పనిచేస్తున్నారు. దురదృష్టవశాత్తూ పెద్దసంఖ్యలో భారతీయులు ప్రాణాలు కోల్పోవడంతో వారి కుటుంబాలు శోకసముద్రంలో మునిగిపోయాయి. ప్రమాదం జరిగిన టైంలో ఆ భవనంలో 160 మంది ఉన్నారని తెలిసింది. ఈ భవనంలోని ఓ కిచెన్ రూంలో మొదలైన మంటలు క్షణాల్లోనే భవనమంతా వ్యాపించాయి. ఈ ప్రమాదం సంభవించిన భవనం కువైట్‌లోని అతిపెద్ద నిర్మాణ సంస్థకు చెందినదిగా గుర్తించారు. ప్రమాదం జరిగిన సమయంలో భవనంలో చాలా మంది నిద్రలో ఉన్నారు. దీంతో ప్రాణనష్టం ఎక్కువగా ఉన్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

Also Read : Amit Shah – Tamilisai : తమిళిసైపై అమిత్‌షా సీరియస్.. చంద్రబాబు ప్రమాణ స్వీకార వేదికపై ఘటన

కువైట్‌ అగ్ని ప్రమాద ఘటనపై భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ విషయం తెలిసిన వెంటనే కువైట్‌లోని భారతీయ రాయబారి ఘటనా స్థలాన్ని సందర్శించారని, బాధితులకు పూర్తి సహకారం అందిస్తామన్నారు. ఈ ప్రమాదంపై కువైట్‌ అధికారుల నుంచి సమాచారం కోసం ఎదురుచూస్తున్నట్లు జైశంకర్ వెల్లడించారు.

Also Read : Relationship Tips : విడాకుల వైపు వెళ్లకుండ వైవాహిక జీవితాన్ని ఎలా చక్కదిద్దుకోవాలి.?