Site icon HashtagU Telugu

Kim – Putin : ఉత్తర కొరియాలో పుతిన్.. కిమ్‌తో భేటీ.. కీలక ఎజెండా !

Kim Jong Un Vladimir Putin

Kim – Putin : ఉక్రెయిన్‌కు ఆయుధాలను అందించి తీరుతామని అమెరికా తేల్చి చెప్పిన నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉత్తర కొరియా పర్యటనకు వెళ్లారు. బుధవారం తెల్లవారుజామున ప్యోంగ్యాంగ్ ఎయిర్‌పోర్టులో రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ ఘన స్వాగతం పలికారు. ఆత్మీయ ఆలింగనంతో పుతిన్‌కు తమ దేశంలోకి ఆహ్వానం పలికారు.

We’re now on WhatsApp. Click to Join

పుతిన్‌ను రిసీవ్ చేసుకున్న అనంతరం ఆయనను తన కారులోనే ఉత్తర కొరియా రాజధాని ప్యోంగ్యాంగ్ నగరంలోని  కుమ్సుసాన్ స్టేట్ గెస్ట్ హౌస్‌కు తీసుకెళ్లారు.  ఈ పర్యటనలో భాగంగా పుతిన్‌తో  కిమ్ జోంగ్ ఉన్(Kim – Putin) 90 నిమిషాల పాటు సమావేశం అవుతారు. అనంతం కిమ్ ఇంట్లో పుతిన్‌కు టీ పార్టీ ఉంటుంది. ఆ సమయంలో అనధికారిక చర్చలు జరుగుతాయి.  ఈక్రమంలో ఈ ఇద్దరు నాయకులతో ఫోటో ఆప్ సెషన్‌ను నిర్వహిస్తారు.  ఈసందర్భంగా పుతిన్ కోసం గాలా కచేరీ, రాష్ట్ర రిసెప్షన్, గౌరవ గార్డ్ వేడుక జరుగుతాయి. ఈపర్యటనలో భాగంగా అనేక ఉమ్మడి పత్రాలపై పుతిన్, కిమ్ సంతకాలు చేస్తారు. ఈసారి పుతిన్ పర్యటనలో భాగంగా రష్యా, ఉత్తర కొరియా మధ్య రక్షణపరమైన సహకారానికి సంబంధించిన ఒప్పందాలు కుదరనున్నాయి. అణ్వాయుధాల అభివృద్ధి నేపథ్యంలో ఉత్తర కొరియాపై అమెరికా కఠిన ఆంక్షలు విధించింది.  ఉక్రెయిన్‌తో యుద్ధం కారణంగా రష్యాపైనా ఆంక్షలు విధించింది.

Also Read :Space Elevator : ఆకాశానికి లిఫ్ట్.. భూమి నుంచి ఉపగ్రహం వరకూ కేబుల్

ఈ పరిణామం పొరుగున ఉన్న దక్షిణ కొరియాకు మరోసారి షాక్ ఇచ్చింది. దక్షిణ కొరియాకు అమెరికా పెద్దఎత్తున ఆయుధాలను విక్రయిస్తుండగా.. ఉత్తర కొరియాకు రష్యా అత్యాధునిక ఆయుధాలను అందిస్తోంది. ఉక్రెయిన్ యుద్ధంలోకి ఒకవేళ నాటో దేశాలు ప్రవేశిస్తే.. అది ప్రపంచ యుద్ధంగా మారొచ్చనే ఆందోళనలు నెలకొన్నాయి. ఈ తరుణంలో కొరియా ద్వీపకల్పంతో తమ మిత్రదేశంగా ఉన్న ఉత్తర కొరియాను సైనికపరంగా సన్నద్ధం చేసే ప్రయత్నాల్లో పుతిన్ ఉన్నారని పరిశీలకులు అంటున్నారు. ఇందుకోసమే పుతిన్ ఇప్పుడు ఆ దేశంలో పర్యటిస్తున్నారని చెప్పారు.

Also Read :Skin Bank : భారత సైన్యం కోసం ‘స్కిన్ బ్యాంక్’

ఉత్తర కొరియా పర్యటనకు బయలుదేరే ముందు ‘కొరియన్‌ సెంట్రల్‌ న్యూస్‌ ఏజెన్సీ’కి పుతిన్ సంచలన వ్యాసం రాశారు. ఉక్రెయిన్‌తో యుద్ధంలో ఉత్తర కొరియా తమకు మద్దతుగా నిలుస్తోందని అందులో ప్రకటించారు. అమెరికా విధించిన ఆంక్షలను కలిసికట్టుగా ఎదుర్కొంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పశ్చిమ దేశాల ప్రభావం పడకుండా చెల్లింపుల వ్యవస్థలను సైతం అభివృద్ధి చేస్తామని పుతిన్ వెల్లడించారు.