Site icon HashtagU Telugu

Kamal Haasan Birthday : కమలహాసన్ జీవితంలోని ఆసక్తికర విశేషాలు

kamal hassan

kamal hassan

Kamal Haasan Birthday : ‘కమలహాసన్‌’.. ఈ పేరు చెప్పగానే మనకు ఆయన నేచురల్ యాక్టింగ్ గుర్తుకు వస్తుంది. సహజమైన డైలాగ్ డెలివరీ కళ్లెదుట కనిపిస్తుంది. నటనలో తనదైన ముద్రవేసిన కమలహాసన్ 69వ బర్త్ డే ఈరోజే (నవంబర్‌ 7) . ఆయన రాత్రికి రాత్రి గొప్ప స్టార్ కాలేదు. దాని వెనుక చాలా శ్రమ ఉంది. సహనం ఉంది. పట్టుదల ఉంది. ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళితే.. నాలుగేళ్ల వయసులోనే బాల నటుడిగా కమలహాసన్ సినిమా కెరీర్ మొదలైంది. 1960లో జెమినీ గణేష్ మహానటి సావిత్రి నటించిన ‘కళాతూర్ కన్నమ్మ’  చిత్రంలో చైల్డ్ యాక్టర్ గా కమలహాసన్ నటించారు. అప్పుడు కమలహాసన్ వయసు 6 సంవత్సరాలు. ఈ సినిమాలో నటించినందుకు చైల్డ్ యాక్టర్ గా రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రెసిడెంట్ అవార్డును అందుకున్నారు. ఆ తర్వాత చదువు కోసం ఆయన సినిమాలకు గ్యాప్ ఇచ్చారు. 1970లో మళ్ళీ సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు.  అయితే ఈసారి నటుడు గానే కాకుండా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ డాన్సర్ గా పని చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

Also Read: Whats Today : హైదరాబాద్‌కు ప్రధాని మోడీ.. పెద్దపల్లికి సీఎం కేసీఆర్.. పుట్టపర్తికి జగన్