Gaza Divided : గాజాలోకి ఇజ్రాయెల్ సైన్యం చొచ్చుకుపోతోంది. ఉత్తర గాజా సరిహద్దును దాటేసి.. దాదాపు 15 కిలోమీటర్లు లోపలికి తమ దళాలు చొచ్చుకుపోయాయని ఇజ్రాయెల్ ఆర్మీ ప్రకటించింది. ప్రస్తుతం తమ సైన్యం.. గాజా నగరాన్ని దక్షిణ గాజా, ఉత్తర గాజా అనే రెండు భాగాలుగా డివైడ్ చేసే పనిలో నిమగ్నమై ఉందని వెల్లడించింది. ప్రధానంగా ఉత్తర గాజా నుంచే ఇజ్రాయెల్‌లోకి చొరబాట్లు, దాడులు జరుగుతున్నందు వల్ల..ఉత్తర గాజాను దక్షిణ గాజా నుంచి విడదీయాలని ఇజ్రాయెల్ ప్లాన్ చేస్తోందని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఉత్తర గాజాపై తన నిఘాను మరింత పెంచడంపై ఇజ్రాయెల్ ఫోకస్ ఉండబోతోందని సమాచారం. ఈక్రమంలోనే ఉత్తర గాజాలోని చాలావరకు హమాస్ మిలిటెంట్ల భూగర్భ సొరంగాలను ఇజ్రాయెల్ ఆర్మీ ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది.
We’re now on WhatsApp. Click to Join.
అయితే ఈ గ్రౌండ్ ఆపరేషన్ చాలా సవాళ్లతో కూడుకున్నదని.. గాజా మార్గంలో ఎన్నో ఆటంకాలు ఎదురవుతున్నాయని ఇటీవల స్వయంగా ఇజ్రాయెల్ ప్రధానమంతి బెంజమిన్ నెతన్యాహు తెలిపారు. దీన్నిబట్టి హమాస్ నుంచి ప్రతిఘటన ఎలా ఎదురవుతోందో అర్థం చేసుకోవచ్చు. ఈ భూతలదాడిలో ఇప్పటివరకు వందల సంఖ్యలో హమాస్ మిలిటెంట్లు, కీలక కమాండర్లు హతం కాగా.. కొంతమంది ఇజ్రాయెలీ సైనికులు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఇజ్రాయెల్ ఆర్మీ ప్రకారం.. ఇప్పటివరకు దానికి చెందిన 25 మంది సైనికులు చనిపోయారు. ఈ యుద్ధంలో మొత్తం సైనిక మరణాల సంఖ్య 332కి చేరుకుందని, మరో 260 మంది సైనికులు గాయపడ్డారని(Gaza Divided) వెల్లడించింది.