Israel Bombs Ambulances : అంబులెన్సులపైకి ఇజ్రాయెల్ బాంబులు.. 15 మంది మృతి, 60 మందికి గాయాలు

Israel Bombs Ambulances : ఇజ్రాయెల్ ఆర్మీ మానవత్వం లేకుండా రాక్షసంగా ప్రవర్తించింది.

  • Written By:
  • Updated On - November 4, 2023 / 07:46 AM IST

Israel Bombs Ambulances : ఇజ్రాయెల్ ఆర్మీ మానవత్వం లేకుండా రాక్షసంగా ప్రవర్తించింది. గాజా పాలిట సంజీవనిలా మారిన ఏకైక పెద్ద హాస్పిటల్ అల్ -షిఫా ఆస్పత్రి నుంచి ఈజిప్టుకు రోగులతో బయలుదేరిన అంబులెన్సుల కాన్వాయ్‌పైకి ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు బాంబులు జారవిడిచాయి. బాంబుల పేలుడు ధాటికి అంబులెన్సులన్నీ రక్తసిక్తం అయ్యాయి.  ఆ అంబులెన్సులలోని రోగుల్లో దాదాపు 15 మంది అక్కడికక్కడే చనిపోయారు. దాదాపు 60 మంది రోగులు తీవ్ర గాయాల పాలయ్యారు. అంబులెన్సుల సమీపం నుంచి వెళ్తున్న వాహనదారులు, స్థానికులు కూడా ఈ ఘటనలో గాయపడ్డారు. మెరుగైన చికిత్స కోసం అల్ – షిఫా ఆస్పత్రి నుంచి రోగులను ఈజిప్టు బార్డర్‌లో ఏర్పాటు చేసిన హాస్పిటల్‌కు తరలిస్తుండగా ఇజ్రాయెల్ ఈ పాశవిక దాడికి పాల్పడింది. కాగా,  గాజాలోని అతిపెద్ద ఆసుపత్రి అల్-షిఫా. ఇజ్రాయెల్ దాడుల వల్ల గాజాలోని దాదాపు 16 ఆసుపత్రులు పని చేయడంలేదు. ఈ తరుణంలో గాజాలో అత్యవసర చికిత్స కోసం సంజీవనిగా అల్-షిఫా ఆసుపత్రి(Israel Bombs Ambulances) మారింది.

We’re now on WhatsApp. Click to Join.

ఇజ్రాయెల్ యుద్ధనీతి లేదా ? : డబ్ల్యూహెచ్‌ఓ

అంబులెన్సులపై ఇజ్రాయెల్ సైన్యం దాడి అమానుషం అని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ అన్నారు. ఈ ఘటనకు సంబంధించిన వార్త విని నేను పూర్తిగా దిగ్భ్రాంతికి గురయ్యాను అని ఆయన పేర్కొన్నారు. కనీసం రోగులు, ఆరోగ్య కార్యకర్తలు, అంబులెన్స్‌లపై దాడులు జరపకపోవడం యుద్ధనీతి అనే విషయాన్ని ఇజ్రాయెల్ గుర్తించాలని హితవు పలికారు.

Also Read: North India Tremors : నాలుగు రాష్ట్రాల్లో భూప్రకంపనలు.. రాత్రంతా రోడ్లపైనే జనం