Hostages Killed : ఇజ్రాయెల్ సైన్యం గాజా గ్రౌండ్ ఆపరేషన్‌లో విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. హమాస్ మిలిటెంట్లపై దాడి చేసే క్రమంలో టెన్షన్‌కు గురై.. పొరపాటున పలువురు ఇజ్రాయెలీ సైనికులు ఒకరినొకరు కాల్చుకొని చనిపోయారు. ఇలా దాదాపు పది నుంచి 20 మంది చనిపోయి ఉంటారని ఇజ్రాయెల్ ఆర్మీ ఇటీవల వెల్లడించింది. తాజాగా మరో బాధాకర విషయం వెలుగుచూసింది. ఇజ్రాయెల్ ఆర్మీ చేపడుతున్న గాజా గ్రౌండ్ ఆపరేషన్ ప్రధాన లక్ష్యాలు రెండు.. అక్కడి నుంచి హమాస్ మిలిటెంట్లను ఏరిపారేయడం మొదటి లక్ష్యం. హమాస్ మిలిటెంట్ల అదుపులో ఉన్న మిగతా బందీలను విడిపించడం(Hostages Killed) రెండో లక్ష్యం. ఇజ్రాయెల్ సైనికులు ఇప్పుడు చేస్తున్న చేష్టలతో రెండో లక్ష్యం కూడా దెబ్బతినేలా ఉంది.
We’re now on WhatsApp. Click to Join.
ఇజ్రాయెలీ సైనికులు టెన్షన్లో హమాస్ మిలిటెంట్ల అదుపులో ఉన్న ఇజ్రాయెలీ బందీలను కూడా కాల్చి చంపేస్తున్నారు. ఇటీవల ఈవిధంగా ముగ్గురు ఇజ్రాయెలీ బందీలను తమ సైనికులు పొరపాటున కాల్చి చంపారని ఇజ్రాయెల్ సైన్యం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఉగ్రవాదులై ఉండొచ్చని భావించి ఇజ్రాయెలీ బందీలపై తమ సైనికులు కాల్పులు జరిపారని తెలిపింది. ఇజ్రాయెల్ ఆర్మీ జరిపిన కాల్పుల్లో చనిపోయిన ముగ్గురు బందీలను ఇజ్రాయెల్‌కు చెందిన యోతమ్ హైమ్, అలోన్ షమ్రిజ్, సమేర్ ఎల్-తలాల్కాగా గుర్తించారు. ‘‘ మా సైన్యమే మా వాళ్లను కాల్చి చంపడం భరించలేని విషాదం. చనిపోయిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం’’ అని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఓ ప్రకటనలో తెలిపారు.