Golani Brigade : గాజాపై ఇజ్రాయెల్ ఆర్మీ వైమానిక, భూతల దాడులను ప్రారంభించి దాదాపు 75 రోజులు గడిచిపోయాయి. అయినా ప్రపంచంలోనే అడ్వాన్స్‌డ్ ఆర్మీగా చెప్పుకునే ఇజ్రాయెల్.. గాజా సిటీని ఆక్రమించలేకపోయింది. పైగా గాజాలోని హమాస్ మిలిటెంట్ల గొరిల్లా దాడులను తట్టుకోలేక.. గ్రౌండ్ ఆపరేషన్ చేస్తున్న కొన్ని బెటాలియన్లను ఇజ్రాయెల్ వెనక్కి పిలిపించుకుంటోంది. దాదాపు 75 ఏళ్ల చరిత్ర కలిగిన ఇజ్రాయెల్ ఆర్మీలోని గొలానీ బ్రిగేడ్‌లోని 13వ బెటాలియన్ గాజా నుంచి ఇజ్రాయెల్‌కు తిరిగి వచ్చేసింది. హమాస్ మిలిటెంట్లు చేసిన దాడుల్లో చాలా ప్రాణ నష్టం సంభవించింది. గొలానీ బ్రిగేడ్‌లోని ఎంతోమంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. మరెంతో మంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఆ వివరాలను ఇజ్రాయెల్ ఆర్మీ బయటికి వెల్లడించడం లేదని అరబ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. గాజాలోని షుజయ్యా జిల్లాలో గొలానీ బ్రిగేడ్‌కు అడుగడుగునా తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. గొలానీ బ్రిగేడ్ స్థానంలో మరో బెటాలియన్‌ను అక్కడ పోరాటానికి పంపారు. అయితే గాజా నుంచి బయటికి వచ్చిన తర్వాత గొలానీ బ్రిగేడ్‌లోని సైనికులు సంబరాలు జరుపుకుంటున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓ వైపు గాజాలో ఇజ్రాయెలీ ఆర్మీకి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతుంటే.. ఎంతోమంది సైనికులు చనిపోతుంటే.. గొలానీ బ్రిగేడ్(Golani Brigade) ఎందుకు సంబరాలు చేసుకుందనే దానిపై చర్చ జరుగుతోంది.
Golani Brigade : గాజా నుంచి పీఛేముడ్.. ఇంటికి చేరిన ఇజ్రాయెల్ గొలానీ బ్రిగేడ్

Israel Vs Gaza