Site icon HashtagU Telugu

IND vs SL: ఎనిమిదోసారి ఆసియా క‌ప్‌ను ముద్దాడిన భార‌త్

Team India Asia Cup champ

Team India Asia Cup champ

IND vs SL: టీమిండియా ఆసియా క‌ప్ ఫైన‌ల్లో డిఫెండింగ్ చాంపియ‌న్ శ్రీ‌లంక‌ను మట్టికరిపించింది. కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో మహ్మద్ సిరాజ్ దూకుడుకి లంక బ్యాటర్లు వణికిపోయారు. బంతి బంతికి ఓ గండంలా భావించారు. ఇన్నింగ్స్ లో జస్ప్రీత్ బుమ్రా మొదటి ఓవర్ లో తొలి వికెట్ పడగొడితే ఆ తరువాత మహ్మద్ సిరాజ్ బంతితో ఓ ఆట ఆడుకున్నాడు. దీంతో ఇనింగ్స్ లో 6 వికెట్లు తీసుకుని శ్రీలంకను కేవలం 50 పరుగులకే కుప్పకూల్చడు.

2010 తర్వాత భారత్, శ్రీలంక జట్లు తొలిసారిగా తలపడ్డాయి. ఇరు దేశాల మధ్య చివరిసారి జరిగిన ఆసియా కప్ 2010ఫైనల్‌ మ్యాచ్‌లో టీమిండియా గెలుపొందింది. మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని టీమిండియా 81 రన్స్ తేడాతో గెలిచింది. ఆ తర్వాత 2016, 2018 టోర్నీల్లో భారత్ గెలిచినా.. అది శ్రీలంకపై కాదు. ఇలా 13 సంవత్సరాల తర్వాత ఇరు జట్ల మధ్య జరిగిన ఆసక్తికర పోరులో వార్ వన్ గా మారింది.51 పరుగుల లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన భారత్ కేవలం 6.1 ఓవర్లలోనే లక్ష్యాన్నిఛేదించింది.

టీమిండియా యువ ఓపెనర్లు శుభ్ మాన్ గిల్, ఇషాన్ కిషన్ ఇద్దరే పని పూర్తి చేశారు. గిల్ 23, కిషన్ 21 పరుగులతో అజేయంగా నిలిచారు. ఈ మ్యాచ్ లో మహ్మద్ సిరాజ్ చరిత్ర సృష్టించాడు. ఒకే ఓవర్‌లో నాలుగు వికెట్లు తీసిన మొట్టమొదటి భారత బౌలర్‌గా వరల్డ్ రికార్డు క్రియేట్ చేశాడు భారత్ కు ఇది 8వ ఆసియా కప్ టైటిల్. గతంలో మనోళ్లు 1984, 1988, 1990-91, 1995, 2010, 2016, 2018లో ఆసియా కప్ గెలుచుకున్నారు.

Also Read: IND vs SL: శ్రీలంక (50) ఆలౌట్.. పగ తీర్చుకున్న టీమిండియా