Site icon HashtagU Telugu

India vs Afghanistan: సూపర్‌-8లో బోణీ కొట్టిన టీమిండియా.. 47 పరుగులతో భారత్‌ ఘన విజయం!

India vs New Zealand

India vs New Zealand

India vs Afghanistan: టీ20 ప్రపంచకప్‌లో సూపర్ 8లో భారత్, ఆఫ్ఘనిస్థాన్ (India vs Afghanistan) మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత్‌ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత్ 47 పరుగుల తేడాతో విజయం సాధించింది. టీ20 ప్రపంచకప్‌లో ఆఫ్ఘనిస్థాన్‌పై భారత్‌కు ఇది నాలుగో విజయం. టీ20 ప్రపంచకప్‌లో ఆఫ్ఘనిస్థాన్‌ ఇప్పటి వరకు భారత్‌ను ఓడించలేకపోయింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా 8 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేయగా.. 182 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్థాన్‌ జట్టు కేవలం 134 పరుగులకే ఆలౌట్‌ అయ్యింది. దీంతో టీమిండియా 47 పరుగుల తేడాతో గెలుపొందింది. అర్ష్‌దీప్‌ సింగ్‌, బుమ్రా చెరో మూడో వికెట్లు తమ ఖాతాలో వేసుకోగా.. కుల్దీప్‌ యాదవ్‌ రెండు వికెట్లు సాధించాడు. ఈ మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించిన జట్టులోని ఐదుగురు ఆటగాళ్ల గురించి తెలుసుకుందాం.

సూర్యకుమార్ యాదవ్

తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమ్ ఇండియా ఒక్కసారిగా మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సందర్భంలో బ్యాటింగ్‌కు వచ్చిన సూర్యకుమార్ యాదవ్ భారత్‌ స్కోరు బోర్డును పెంచే బాధ్యతలు స్వీకరించారు. అతను శివమ్ దూబే, హార్దిక్ పాండ్యాతో ముఖ్యమైన భాగస్వామ్యాలను నెలకొల్పాడు. సూర్య ఫిఫ్టీ చేశాడు. 28 బంతుల్లో 53 పరుగులు చేశాడు.

Also Read: Errolla Srinivas: కాంగ్రెస్ కు నిరుద్యోగులు గుణపాఠం చెబుతారు: ఎర్రోళ్ల శ్రీనివాస్‌

హార్దిక్ పాండ్యా

టీమిండియా 90 పరుగుల వద్ద నాలుగు వికెట్లు కోల్పోయింది. ఈ సమయంలో హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ టీమ్ ఇండియా ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. వీరిద్దరూ 60 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. హార్దిక్ పాండ్యా 32 పరుగుల ముఖ్యమైన సహకారం అందించాడు.

అక్షర్ పటేల్

భారత్ ఈ విజయంలో అక్షర్ పటేల్ కూడా కీలక పాత్ర పోషించారు. చివరి ఓవర్‌లో వేగంగా పరుగులు చేయడం ద్వారా భారత్ స్కోరును 180 దాకా తీసుకెళ్లాడు. దీంతోపాటు బౌలింగ్‌లోనూ వికెట్‌ తీశాడు. ఓవర్ మెయిడిన్ కూడా వేశాడు.

జస్ప్రీత్ బుమ్రా

సూపర్ 8 తొలి మ్యాచ్‌లోనూ బుమ్రా మ్యాజిక్ కనిపించింది. అతను ఆఫ్ఘనిస్తాన్ అత్యంత ప్రమాదకరమైన బ్యాట్స్‌మెన్లు గుర్బాజ్, జజాయ్‌లను అవుట్ చేశాడు. ఈ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా గుర్బాజ్ నిలిచాడు. ఇలాంటి సమయంలో అతనిని ముందుగానే అవుట్ చేయడం వల్ల భారత్ కూడా లాభపడింది.

We’re now on WhatsApp : Click to Join

అర్ష్‌దీప్ సింగ్

భారత్ విజయంలో అర్ష్‌దీప్ సింగ్ కూడా కీలక పాత్ర పోషించాడు. మ్యాచ్ చివర్లో రషీద్ ఖాన్, నవీన్ అల్ హక్‌లను అవుట్ చేశాడు. అతని అద్భుతమైన బౌలింగ్ కారణంగా ఈ మ్యాచ్‌ను త్వరగా ముగించడంలో భారత్ విజయవంతమైంది.