Site icon HashtagU Telugu

India – Gold Medal : ఆసియా గేమ్స్ లో ఇండియాకు తొలి గోల్డ్ మెడల్

India Gold Medal

India Gold Medal

India – Gold Medal : చైనాలోని హాంగ్‌జౌలో జరుగుతున్న ఆసియా క్రీడలలో భారత్ మొదటి బంగారు పతకాన్ని గెలుచుకుంది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ పురుషుల టీమ్ ఈవెంట్‌లో భారత షూటర్లు రుద్రాంక్ష్ పాటిల్, ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్, దివ్యాంష్ సింగ్ పన్వార్  1893.7 స్కోరుతో మొదటి స్థానంలో నిలిచారు. దీంతో గోల్డ్ మెడల్ వారికి కైవసం అయింది. 1893.7 స్కోరుతో వారు మునుపటి ప్రపంచ రికార్డును బద్దలు కొట్టారు. ఈ ఈవెంట్‌లో దక్షిణ కొరియా రజత పతకాన్ని కైవసం చేసుకుంది. చైనా షూటర్లు 1888.2 పాయింట్లతో మూడో స్థానంలో (India – Gold Medal)  నిలిచారు.

Also read : Ganesh : ఖైర‌తాబాద్ మ‌హాగ‌ణ‌ప‌తి ద‌ర్శించుకునేందుకు భారీగా త‌ర‌లివ‌స్తున్న భ‌క్తులు

ముగ్గురు భారత షూటర్లలో రుద్రాంక్ష్ పాటిల్ అత్యధికంగా 632.5 స్కోరు సాధించగా.. ఐశ్వరీ తోమర్ 631.6 పాయింట్లు, దివ్యాంష్ పన్వార్ 629.6 పాయింట్లు పొందారు.  ఇక పడవ రేసు (రోయింగ్‌)లో భారత్‌కు మరో పతకం లభించింది. నలుగురు సభ్యుల రోయింగ్ టీమ్ ఈవెంట్ లో భారత్‌కు చెందిన జస్విందర్ సింగ్, భీమ్ సింగ్, పునీత్ కుమార్, ఆశిష్ కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నారు. అంతకుముందు ఒకే వ్యక్తి పడవ నడిపే రోయింగ్ ఈవెంట్ లో భారత్ కు చెందిన బల్‌రాజ్ పన్వార్ స్వల్ప తేడాతో పతకాన్ని కోల్పోయాడు.