Kitchen Tips : త్వరగా పాడయ్యే కూరగాయల్లో టమాటాలు ఒకటి. వాటిని సరిగ్గా స్టోర్ చేస్తేనే ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంటాయి. సూర్యకాంతి నుంచి దూరంగా ఉంచడం వల్ల టమాటాలు చాలాకాలం పాటు తాజాగా ఉంటాయి. టమాటాలను ఎల్లప్పుడూ గది ఉష్ణోగ్రత వద్ద ఉంచడం బెస్ట్. వాటిలో ముందుగా పండిన వాటిని ఉపయోగించండి. ఒకవేళ మీ దగ్గర పండిన టమాటాలు చాలా ఉన్నప్పుడు మాత్రమే.. వాటిని ఫ్రిజ్‌లో నిల్వ చేయాలి. టమాటాలు త్వరగా కుళ్లిపోకుండా చూసుకోవడానికి , ఎక్కువ కాలం నిల్వ ఉంచడానికి వాటి కాండాన్ని తీసేయండి. ఒకవేళ కాండం ఉంటే టమాటాలు త్వరగా పండిపోతాయి.
We’re now on WhatsApp. Click to Join.
- టమాటాలను బాక్సుల్లో, పాలిథీన్ సంచుల్లోనూ నిల్వ చేయొచ్చు.
- టమాటాలను పాలిథీన్ సంచుల్లో స్టోర్ చేస్తే ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి.
- టమాటాలను మార్కెట్ నుంచి తెచ్చాక పసుపు నీటిలో కడగండి. ఆ తర్వాత వాటిని గాలికి ఆరబెడితే ఫ్రెష్‌గా ఉంటాయి.
- ఒక కంటైనర్‌ను బంకమట్టితో నింపి, దానిలోో టమాటాలను పూడ్చాలి. వీటికి నీరు అస్సలు తగలకూడదు. ఇలా చేస్తే టమాటాలు ఫ్రెష్‌గా ఉంటాయి.
Also Read: Chandrababu: కనకదుర్గమ్మ సేవలో చంద్రబాబు, సతీసమేతంగా పూజలు!
టమాటాను 5 నుంచి 15 రోజులపాటు నిల్వ ఉండేలా చేయటంలో తమ పరిశోధనలు సక్సెస్ అయ్యాయని లక్నోలోని ‘సీఎస్ఐఆర్-ఎన్బీఆర్ఐ’ (నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్) సంస్థ ఈ ఏడాది ఆగస్టులో వెల్లడించింది. ‘టమాటా పండుగా మారేందుకు దోహదపడేది అబ్సెసిక్ ఆమ్లం. మేం జన్యుపరమైన మార్పులతో ఈ ఎంజైమ్‌ను తగ్గించగలిగాం. దీంతో ఎథిలిన్ విడుదల ఆలస్యమై.. అది పండుగా మారే ప్రక్రియ నెమ్మదించింది’ అని ఎన్బీఆర్ఐ తెలిపింది. పంట కోత అయ్యాక మూడు రోజుల్లోగా టమాటాను మార్కెట్‌కు తరలించాల్సి ఉంటుంది. లేదంటే అవి పండుగా మారి కుళ్లిపోతాయి. దీంతో రైతులు పూర్తిగా నష్టపోతున్నారు. ఇలాంటి సమస్యకు ‘సీఎస్ఐఆర్-ఎన్బీఆర్ఐ’ శాస్త్రవేత్తలు తమ తాజా అధ్యయనం ద్వారా సమాధానాన్ని(Kitchen Tips) కనుగొన్నారు.