Second Day Of Swaps : ఇజ్రాయెల్ – హమాస్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ, బందీల బదిలీ ఒప్పందం అమలు ప్రక్రియ కొనసాగుతోంది. కాల్పుల విరమణలో రెండో రోజైన శనివారం 17 మంది బందీలను హమాస్ విడుదల చేసింది. వీరిలో 13 మంది ఇజ్రాయెలీలు ఉన్నారు. మిగతా నలుగురు ఇతర దేశాలవారు. ఇక ఇజ్రాయెల్ కూడా 39 మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేసింది. శనివారం అర్ధరాత్రి టైంలో ఈ ప్రక్రియ జరిగింది.
We’re now on WhatsApp. Click to Join.
గాజాలోకి నిత్యావసరాలు, ఇంధన ట్రక్కులు ప్రవేశించకుండా ఇజ్రాయెల్ ఆర్మీ అడ్డుకుంటోందనే ఆరోపణతో అంతకుముందు శనివారం ఉదయం బందీల విడుదలకు హమాస్ నో చెప్పింది. ఈక్రమంలో ప్రత్యేక విమానంలో ఖతర్‌కు చెందిన దౌత్యవేత్తల టీమ్ ఇజ్రాయెల్‌కు వెళ్లింది. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి కార్యాలయం, విదేశాంగ శాఖ కార్యాలయంతో ఒప్పందం గురించి సంప్రదింపులు జరిపింది. ఆ తర్వాతే మానవతా సహాయ ట్రక్కులను గాజాలోకి ఇజ్రాయెల్ అనుమతించింది. దీంతో బందీల విడుదలకు హమాస్ కూడా రెడీ అయింది.
Also Read: BJP Today : ఇవాళ ప్రధాని మోడీ, అమిత్‌షా, యోగి ప్రచార హోరు
అంతకుముందు శుక్రవారం రోజు 24 మంది బందీలను హమాస్ విడుదల చేసింది. వారిలో 13 మంది ఇజ్రాయెలీలు కాగా, మిగతా వారు థాయ్ సంతతికి చెందిన బందీలు. ఇక ఇజ్రాయెల్ 39 మంది పాలస్తీనా ఖైదీలను రిలీజ్ చేసింది. సోమవారంతో ఇజ్రాయెల్ – హమాస్ కాల్పుల విరమణ ఒప్పందం ముగియబోతోంది. గాజా నుంచి హమాస్‌ను పూర్తిగా పారదోలేదాకా యుద్ధం ఆగదని ఇజ్రాయెల్ అంటోంది. అయితే ఈ నాలుగు రోజుల్లో కేవలం 50 మంది ఇజ్రాయెలీ బందీలు మాత్రమే రిలీజ్ అవుతారు. దాదాపు మరో 150 మంది ఇజ్రాయెలీ బందీలు హమాస్ చెరలోనే ఉన్నారు. వారందరినీ విడిపించేందుకు ఇజ్రాయెల్ ప్రయారిటీ ఇస్తుందా ? హమాస్‌తో తలపడేందుకే రెడీ(Second Day Of Swaps) అవుతుందా ? ఏం జరుగుతుందో వేచిచూడాలి.