Site icon HashtagU Telugu

Whatsapp Feature : వెబ్ ​వర్షన్​​లోనూ ఆ వాట్సాప్ ఫీచర్.. ఎలా పనిచేస్తుందంటే ?

Whatsapp Feature

Whatsapp Feature

Whatsapp Feature : ఇప్పటి వరకు  వాట్సాప్ మొబైల్ యాప్‌లోనే చాట్​లాక్​ ఫీచర్ ఉంది. త్వరలోనే ఈ ఫీచర్ ​ వెబ్​వెర్షన్​లోనూ అందుబాటులోకి రానుంది. దీనితో వాట్సాప్ యూజర్ల ప్రైవసీకి మరింత భద్రత చేకూరుతుంది.  వెబ్ వర్షన్ కోసం ఇప్పటికే ఈ ఫీచరును ప్రయోగాత్మకంగా వాట్సాప్ పరీక్షిస్తోందని ‘వాబీటా ఇన్ఫో’ వెల్లడించింది. ఈ ఫీచర్‌కి సంబంధించిన ఒక ఫొటోను సైతం తన బ్లాగ్​లో షేర్ చేసింది. ఆ ఫొటో ప్రకారం.. వాట్సాప్ వెబ్‌లో కొత్తగా డిజైన్‌ చేసిన సైడ్‌బార్‌ ఎడమవైపు కనిపిస్తుంది. సైడ్​బార్​లోనే ‘చాట్‌ లాక్‌’ ఐకాన్‌, ఆర్కైవ్‌ చాట్స్‌, స్టార్డ్‌ మెసేజెస్‌ ఐకాన్‌ ఉన్నాయి. సాధారణంగా వాట్సాప్  మొబైల్ యాప్‌లో ఈ ఫీచర్‌ సాయంతో ఒకసారి చాట్‌ను లాక్‌ చేస్తే..  కేవలం యూజర్‌ మాత్రమే తన ఫింగర్‌ ప్రింట్‌ లేదా పాస్‌కోడ్‌ ద్వారా ఓపెన్ చేయగలుగుతాడు. లాక్‌ చేసిన చాట్‌ను ఇతరులెవరూ చూడటం కుదరదు. ఇదే ఫీచర్​ను ఇప్పుడు వాట్సాప్ వెబ్​ వెర్షన్​లోనూ తీసుకొస్తున్నారు. టెస్టింగ్ కోసం ఈ ఫీచర్‌ బీటా యూజర్లకు ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది. త్వరలోనే వెబ్ యూజర్లకు కూడా అందుబాటులోకి వచ్చేస్తుంది.

We’re now on WhatsApp. Click to Join

వీడియో కాల్‌ స్క్రీన్‌ షేర్‌ ఫీచర్‌ తెలుసా?

  • యూజర్లు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వీడియో కాల్‌ స్క్రీన్‌ షేర్‌ ఫీచర్‌ను(Whatsapp Feature) వాట్సాప్‌ తీసుకొచ్చింది. ఈ ఫీచర్‌ సహాయంతో ఎవరితోనైనా వీడియో కాల్‌ మాట్లాడుతున్న సమయంలో మీ స్మార్ట్‌ ఫోన్‌ స్క్రీన్‌ను అవతలి వ్యక్తికి షేర్‌ చేసుకోవచ్చు.
  • ఈ ఫీచర్‌ను ఉపయోగించుకోవాలంటే ముందుగా.. మీ వాట్సాప్‌ను ఓపెన్‌ చేయాలి.
  • అనంతరం డౌన్ డ్రాప్‌కి వెళ్లి అందుబాటులో ఉన్న ట్యాబ్‌ పై ప్రెస్ చేయండి. ఇప్పుడు కెమెరా స్విచ్ ఆప్షన్ ఇక్కడ అందుబాటులో ఉంటుంది. దాని పై క్లిక్ చేసిన తర్వాత, స్క్రీన్ షేర్ ఫీచర్ సింబల్‌పై క్లిక్‌ చేయాలి. వెంటనే మీ ఫోన్‌లో ఒక పాప్‌ అప్‌ కనిపిస్తుంది. అనంతరం స్క్రీన్‌ను షేర్ చేయడానికి స్టార్ట్ నౌ పై క్లిక్‌ చేయాలి. దాంతో స్క్రీన్ షేర్ ఫీచర్ యాక్టివేట్ అవుతుంది.
  • మీరు మీ స్క్రీన్‌ను షేర్ చేసుకుంటున్నారని నిర్ధారించడానికి మీకు ఒక అలర్ట్ వస్తుంది.
  • గూగుల్‌ మీట్‌, జూల్‌ కాల్స్‌ వంటి వాటి నుంచి ఎదురయ్యే పోటీని తట్టుకునేందుకు వాట్సాప్‌ ఈ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది.
  • ఇతర గ్రూప్‌ కాల్స్‌లో మాదిరిగా మీటింగ్‌ ప్రారంభించడానికి ముందు షెడ్యూల్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే ఈ ఫీచర్‌తో మీ ఫోన్‌లోని డేటాను షేర్ చేయవచ్చు.

Also Read : Shots Fired : ఉగ్రవాది నిజ్జర్ అనుచరుడే టార్గెట్.. కాల్పులతో కలకలం