Israel Vs Gaza : గాజాపై యుద్ధంలో ఇజ్రాయెల్ ఆర్మీ భారీ నష్టాన్ని చవిచూస్తోంది. ఎంతోమంది ఇజ్రాయెలీ సైనికులను గాజాలోని హమాస్ మిలిటెంట్లు మట్టుబెడుతున్నారు. ఇప్పటివరకు దాదాపు 1000 మందికిపైగా ఇజ్రాయెలీ సైనికులు గాజా గ్రౌండ్ ఆపరేషన్‌లో చనిపోయారని అనధికారిక గణాంకాలు చెబుతున్నాయి. అయితే ఇజ్రాయెల్ మాత్రం ఈ సంఖ్యను తక్కువ చేసి చూపిస్తోంది. ప్రపంచ దేశాల్లో సూపర్ అడ్వాన్స్‌డ్ ఆర్మీగా తనకున్న ప్రతిష్టను దెబ్బతీసుకోవడం ఇష్టంలేక.. అమరులైన తన సైనికుల లెక్కలను ఇజ్రాయెల్ బహిర్గతం చేయడం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
మరో విచిత్రమైన విషయం ఏమిటంటే.. యుద్ధం మెుదలైనప్పటి నుంచి ఇప్పటివరకు చనిపోయిన ఇజ్రాయెల్ సైనికుల్లో 10 శాతం మంది ప్రమాదవశాత్తు మరణించారు. ఈ పది శాతం మందిని పొరపాటున వాళ్ల సొంత బలగాలే కాల్చి చంపాయి. ఈవిషయాన్ని స్వయంగా ఇజ్రాయెల్ రక్షణ దళం (ఐడీఎఫ్) వెల్లడించింది. ‘‘ఇప్పటివరకు మెుత్తం 105 మంది ఇజ్రాయెలీ సైనికులు చనిపోగా, వారిలో 20 మంది ప్రమాదవశాత్తు చనిపోయారు. శత్రు సైన్యం అనుకొని పొరపాటున సొంత బలగాలే 13 మంది ఇజ్రాయెలీ సైనికులను హతమార్చారు. హమాస్ ఉగ్రవాదులు పెట్టిన ల్యాండ్ మైన్స్ తొక్కడం వల్ల మరో ఏడుగురు ఇజ్రాయెలీ సైనికులు చనిపోయారు’’ అని ఐడీఎఫ్ పేర్కొంది.
Also Read: Egg Price : కోడిగుడ్ల ధరకు రెక్కలు.. దిగొస్తున్న చికెన్
ఇజ్రాయెల్ వైమానిక దాడుల కారణంగా గాజాలోని ఆస్పత్రులన్నీ కూలిపోయాయి. గాజాలోని ఆస్పత్రుల్లో మూడింట ఒకవంతు మాత్రమే ఇప్పుడు పనిచేస్తున్నాయి. దాదాపు 23 లక్షల గాజా జనాభాకు 11 ఆస్పత్రులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అవి కూడా పాక్షికంగా పనిచేస్తున్నాయి.. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అక్టోబరు 7న ఇజ్రాయెల్ – గాజా యుద్ధం(Israel Vs Gaza) ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటిదాకా ఇజ్రాయెల్ ఆర్మీ దాడుల్లో గాజాలోని 18,000 మందికిపైగా సామాన్య పౌరులు మరణించారు. వీరిలో మహిళలు, చిన్నారులే అధికంగా ఉన్నారు.