Site icon HashtagU Telugu

TG : రేవంత్ రెడ్డి..దొంగల ముఠా నాయకుడు – గాదరి కిషోర్

Gadari Kishor

Gadari Kishor

సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఫై బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ (Gadari Kishore ) కీలక వ్యాఖ్యలు చేసారు. ‘రేవంత్ రెడ్డి ఓటుకు నోటు దొంగ… దొంగల ముఠా నాయకుడు… అంటూ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీ ఎన్నికల్లో అబద్దపు హామీలు చెప్పి..ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిందని..అధికారంలోకి వచ్చాక హామీలను ఎలా నెరవేర్చాలో ఆలోచన చేయకుండా కేసీఆర్ , బిఆర్ఎస్ పార్టీ ఫై ఆరోపణలు చేస్తూ రోజులు గడుపుతున్నాడని రేవంత్ ఫై కిషోర్ ఆగ్రహం వ్యక్తం చేసారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈరోజు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థిపై 52 నుంచి 53 కేసులు ఉన్నాయన్నారు. ఈ అభ్యర్థి ఎలాంటి బ్లాక్ మెయిలరో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదన్నారు. స్వయంగా రేవంత్ రెడ్డిపై దాదాపు 90 కేసులు ఉన్నట్లుగా ఉందన్నారు. వీరిపై నమోదైన కేసులు తెలంగాణ ఉద్యమం సమయంలో నమోదైనవో… దేశం కోసం జైలుకు వెళ్లినవో కావన్నారు. ఈ కేసులన్నీ వ్యక్తిగత పంచాయతీలు… భూమి పంచాయతీలు… బ్లాక్ మెయిల్ పంచాయతీ కేసులో అన్నారు. తన ఒక్కడిపైనే కేసులో ఉంటే బాగుండదని భావించిన రేవంత్ రెడ్డి తనతో పాటు మరింత మంది దొంగల ముఠాను తయారు చేసుకోవాలని… అలాంటి వారికి టిక్కెట్లు ఇస్తున్నారని ఆరోపించారు.

Read Also : Gunpowder Factory Blast : గన్‌ పౌడర్‌ ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. 17 మంది మృతి