Site icon HashtagU Telugu

Car Scratches : కారుపై గీతలు పడుతున్నాయా ? పెయింటింగ్ పోతోందా ? టిప్స్ ఇవీ

Car Scratches

Car Scratches

Car Scratches : మీ కారు పెయింటింగ్ పోకుండా మెయింటెయిన్ ​ చేయాలని అనుకుంటున్నారా?  కారుపై గీతలు పడకుండా చూడాలని భావిస్తున్నారా ? చాలా మంది కారు మెయింటెనెన్స్​ చేయడం ఎలానో తెలియక తికమకపడుతూ ఉంటారు. ర్యాష్‌ డ్రైవింగ్‌ వల్ల, చెట్ల ఆకులు తగిలి కార్లపై గీతలు పడుతుంటాయి. కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే కారుపై గీతలు పడకుండా, పెయింట్ పోకుండా చూసుకోవచ్చు. ఇవిగో మీకోసమే టిప్స్ రెడీగా ఉన్నాయి.

We’re now on WhatsApp. Click to Join

అలాంటి క్లాత్ వద్దు

మనం కారును నీళ్లతో కడుగుతుంటాం. ఏదో ఒక క్లాత్​తో కారును తడిచేస్తుంటాం. వాస్తవానికి ఇది సరైన పద్ధతి కాదు. గరుకైన వస్త్రంతో, వీల్స్​ తుడిచే గుడ్డతో కారును తుడిస్తే దానిపై గీతలు(Car Scratches) పడుతాయి. ఎందుకంటే కారు పెయింటింగ్‌ ఎంతో మృదువుగా ఉంటుంది. అందుకే కారును తుడిచేందుకు మైక్రో ఫైబర్‌ క్లాత్‌ వాడాలి.

టైర్లను తుడిచే క్లాత్ వాడుతారా ?

కొంతమంది కారు చక్రాలను తుడిచే క్లాత్‌తోనే కారు బాడీని కూడా తుడుస్తుంటారు. ఇది మంచిది కాదు. చక్రాలకు ఉండే మట్టిలో ఎన్నో రాళ్లు ఉంటాయి. టైర్లను కడిగే సమయంలో ఆ రాళ్లు క్లాత్‌లోకి చేరతాయి. అదే క్లాత్‌తో కారు బాడీని శుభ్రం చేస్తే, గీతలు పడతాయి.

జీన్స్ డేంజర్

చాలామంది కారును తాకి నిలబడుతుంటారు.  ఇలా చేయడం వల్ల కూడా వస్త్రాల తాకిడి ఎఫెక్టుతో కారుపై గీతలు పడతాయి.పెయింటింగ్‌ దెబ్బతింటుంది. ప్రధానంగా జీన్స్‌ లాంటి రఫ్‌గా ఉండే వస్త్రాలను ధరించిన వాళ్లు కారును తాకి నిలబడకూడదు. జీన్స్‌ బ్యాక్‌ పాకెట్‌కు ఉండే గుండీల వల్ల కూడా కారుపై గీతలు పడుతుంటాయి.

లోహపు వస్తువులు, కీ, లగేజీ.. 

కారుకు సంబంధించిన మెటల్ కీ చైన్‌ వల్ల కూడా పెయింట్​ పోయి, కారుపై గీతలు పడుతుంటాయి. చాలా మంది ఏ షాపింగ్‌కో, ఇంకోచోటికో వెళ్లినప్పుడు, అక్కడ కొన్న వస్తువులను ఓ కవర్‌లో పెట్టి తీసుకొస్తారు. కారు వద్దకు వచ్చి ఆ లగేజీని కారులో పెట్టేముందు, కారు ముందుభాగంపైనో, లేక కారుపై భాగంపైనో ఆ వస్తువులను ఉంచుతారు. అవి తాకడం వల్ల కూడా కారుపై గీతలు పడుతుంటాయి. కారుపై ముఖ్యంగా లోహపు వస్తువులను ఉంచకూడదు.

కారుపై కవర్‌ కప్పుతారా ?

చాలా మంది కార్లపై కవర్‌ కప్పుతుంటారు. ఈ కవర్ వల్ల కూడా కారుపై గీతలు పడే ఛాన్స్ ఉంటుంది. కవర్‌ కప్పేసమయంలోనూ, తీసే సమయంలోనూ కారు పెయింగ్‌పై ఉండే దుమ్ముతో రాపిడి జరుగుతుంది. అలాగే కవర్‌కు ఉండే కఠినమైన స్వభావం వల్ల కూడా కారుపై గీతలు పడే అవకాశం ఉంటుంది. వాస్తవానికి కారు పెయింటింగ్‌ పాడైతే దాని విలువ ఎంతో తగ్గిపోతుంది. అందువల్ల కారుపై కవర్ వేసేటప్పుడు కొంత జాగ్రత్త వహిస్తే మంచిది.

Also Read : Trump – Russia Attack : నాటో దేశాలపైకి నేనే రష్యాను ఉసిగొల్పుతా: ట్రంప్‌