Site icon HashtagU Telugu

Celebrities Divorces : సెలబ్రిటీల విడాకులకు కారణాలు ఇవేనా ?

Celebrities Divorces

Celebrities Divorces

Celebrities Divorces :  సెలబ్రిటీల విడాకుల వ్యవహారాలు అంటే అందరికీ ఎంతో ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎందుకు విడాకులు తీసుకున్నారు ? అసలేం జరిగింది ? అనే డిస్కషన్స్ జనం నడుమ సాగుతుంటాయి. ఇటీవల హైదరాబాదీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్ విడాకులు తీసుకున్న వ్యవహారంపై సోషల్ మీడియాలో హాట్ డిబేటే నడిచింది. ఈ తరుణంలో సెలబ్రిటీ జంటల్లో విడాకులకు దారితీస్తున్న మానసికపరమైన వైరుధ్యాల గురించి, వాటి నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాల గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

We’re now on WhatsApp. Click to Join.

ఫేమ్.. హెవీ వెయిట్

సెలబ్రిటీలు నిత్యం ప్రజలకు కనిపిస్తుంటారు. ప్రజల మధ్యే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. అందుకే వారిపై ఒత్తిడి ఎక్కువగా  ఉంటుంది. వారు చేసే చిన్న పొరపాటు కూడా అందరూ భూతద్దంలో చూస్తారు, ఘోరమైన తప్పిదంగా మీడియాలో ప్రొజెక్ట్ చేస్తారు. దీంతో ప్రజల్లో ఉన్న ఇమేజ్ ను కాపాడుకోవడానికి వారు నిరంతరం ఒత్తిడి అనుభవిస్తారు. ఈ ఒత్తిడి ఇద్దరి మధ్య ఉన్న ఇబ్బందులను, విభేదాలను తీవ్రతరం చేస్తుంది. బంధం, అనుబంధం డీప్గా మారడానికి ఆటంకం కలిగిస్తుంది.

అహంభావం

కీర్తి, సంపద, నిరంతర పాపులారిటీ వ్యక్తిలో అహంభావాన్ని, తద్వారా నార్సిసిజంను పెంచుతాయి. అంటే తనను తాను ప్రేమించుకోవడం పెరిగిపోతుంది. ఫలితంగా భాగస్వామి పట్ల సహానుభూతి, రాజీపడే తత్వం తగ్గిపోతాయి. భాగస్వాములను పాపులారిటీలో తనతో పోటీపడే కాంపిటీటర్‌గా మారుస్తుంది. పరస్పర విశ్వాసం, సాన్నిహిత్యాన్ని దెబ్బతీస్తుంది.

బిజీ జీవితం

సెలబ్రిటీల జీవితం ఎడతెగని షెడ్యూల్‌లు, చాలాకాలం పాటు విడివిడిగా ఉండాల్సి రావడంతో పరస్సర భావోద్వేగ సంబంధాన్ని కొనసాగించడంలో, విశ్వాసాన్ని పెంపొందించడంలో సవాళ్లుగా మారతాయి. భౌతికంగా, మానసికంగా అధిగమించలేని దూరాలను సృష్టిస్తాయి. చివరికి ఒకరితో ఒకరు డిస్ కనెక్ట్ అవుతారు.

Also Read: Djokovic – Sania : సానియాతో కలిసి పనిచేస్తా.. అదే నా లక్ష్యం : జ‌కోవిచ్

స్వాతంత్య్ర భావం

సెలబ్రిటీలకు ఉండే ఆర్థిక భద్రత ఒక గిఫ్ట్‌లా కనిపించినప్పటికీ, సాంప్రదాయిక నిబద్ధతలను చెరిపేసే స్వాతంత్య్ర భావాన్ని కూడా పెంపొందిస్తుంది. ఫలితంగా సెలబ్రిటీ జంటలు వారి కాపురంలో ఎదుర్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు, సయోధ్యకోసం తక్కువ మొగ్గు చూపుతారు. ఎవరిదారి వారు చూసుకుంటారు. కరిష్మా కపూర్, సంజయ్ కపూర్‌ల న్యాయ పోరాటంలో హైలైట్ కావడం గమనార్హం.

మెరిసే జీవితాల వెనుక..

పైన మనం చెప్పుకున్నవన్నీ సాధారణ మానసిక కారణాలు మాత్రమే. ప్రతి సెలబ్రిటీ విడాకుల వెనుక దానివైన ప్రత్యేక కారణాలు ఉంటాయని మనం గుర్తించాలి. పాపులారిటీకే ప్రాధాన్యం ఇవ్వడం,వివాహేతర సంబంధాలు, మానసిక ఒత్తిళ్లు, అహంకారం, అననుకూలత లాంటి అనేక అంశాలు ఉండొచ్చు. తెరపై మెరిసే తారల జీవితాల్లో కూడా మనకు తెలియని అనేకానేక చీకటి గాధలు, బాధలు ఉండొచ్చు. అలాంటి టైంలో అహానికి పోకుండా  ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకుంటే మెరుగైన ఫలితం ఉంటుంది.