Neckzilla : కొలంబియాకు చెందిన అతగాడి పేరు రూబియెల్ మస్క్వెరా.. కానీ అందరూ ‘నెక్ జిల్లా’ అని పిలుస్తుంటారు. ఎందుకంటే అతడి నెక్ (మెడ) అంత విశాలంగా, వెడల్పుగా ఉంటుంది. ప్రపంచంలో అత్యంత మందమైన మెడ రూబియెల్ మస్క్వెరాదే అని కూడా డిబేట్ జరుగుతోంది. ఇటీవల మస్క్వెరా తన మెడ చుట్టుకొలత తీసుకోగా.. అది 20 అంగుళాల (52 సెం.మీ) కంటే ఎక్కువ మందంతో ఉందని తేలింది. ఈ చుట్టుకొలత వివరాలు, ఫొటోతో అతడు ఇన్ స్టాగ్రామ్ లో చేసిన పోస్టుకు నెటిజన్స్ నుంచి కామెంట్స్ లైక్స్ వీర లెవల్ లో వచ్చాయి. వామ్మో.. ఏం రేంజ్ లో మెడను డెవలప్ చేశావ్ అంటూ మస్క్వెరాను నెటిజన్స్ ప్రశంసలతో ముంచెత్తారు.
We’re now on WhatsApp. Click to Join.
రూబియెల్ మస్క్వెరా.. ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ బాడీ బిల్డర్స్ (IFBB) యొక్క ఎలైట్ ప్రో లీగ్‌లో పోటీ పడుతున్నాడు. అతడి అసాధారణమైన శరీరాకృతి, శరీర నిర్మాణాన్ని గుర్తించబట్టే IFBB పోటీలకు ఎంపిక చేశారు. 2021లో జరిగిన IFBB పోటీలో అతడు గెలవలేదు. కానీ 2022లో జరిగిన IFBB పోటీలో ఫస్ట్ ప్లేస్ లో నిలిచాడు.రూబియెల్ మస్క్వెరాకు ఇన్స్టాగ్రామ్ లోనూ 3.11 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఆయన తన ప్రతి సోషల్ మీడియాలో పోస్ట్ లో Neckzilla అనే హ్యాష్‌ట్యాగ్‌ను ఉపయోగిస్తుంటాడు. దీన్నిబట్టి మెడ భాగంలోని కండరాల డెవలప్మెంట్ పై ఆయనకు ఉన్న ఫోకస్ ను(Neckzilla) అర్థం చేసుకోవచ్చు.