Plane Ticket – Rs 108 : ఛైనాలోని చైనా సదరన్ ఎయిర్‌లైన్స్ కంపెనీ విమాన టికెట్లను 108 రూపాయలకే విక్రయించింది. చాలామంది జనం ఈ చౌక టికెట్లను కొని విమానంలో దర్జాగా జర్నీ కూడా చేశారు. అదేదో ఫెస్టివల్ సీజన్ ఆఫర్ అనుకుంటున్నారా ? అదేం లేదు.. చైనా సదరన్ ఎయిర్‌లైన్స్ టికెట్లు జారీ చేసే సాఫ్ట్‌వేర్‌లో టెక్నికల్ సమస్య ఏర్పడింది. దీంతో ఆ కంపెనీ మొబైల్ యాప్ పనితీరు గాడి తప్పింది. సాధారణంగా దాదాపు రూ.6వేలు ఉండే టికెట్ ధరను రూ.108గా చూపించింది. దీంతో జనం ఎగబడి వెంటనే ఆ టికెట్లను కొనేశారు. ఈక్రమంలో కొంతమంది టికెట్ రేట్లు తగ్గిపోయిన విషయాన్ని మొబైల్ యాప్ ద్వారా చైనా సదరన్ ఎయిర్ లైన్స్ కంపెనీకి తెలియజేశారు. దీంతో రంగంలోకి దిగిన కంపెనీ టెక్నికల్ నిపుణులు సమస్యను పరిష్కరించారు.
We’re now on WhatsApp. Click to Join.
చైనాలోని బీజింగ్ నుంచి చెంగ్డూ నగరానికి వెళ్లే విమానం టికెట్ ధర సాధారణంగా రూ.6వేలకుపైనే ఉంటుంది. కానీ యాప్‌లో తలెత్తిన సమస్య వల్ల టికెట్ల రేట్లు రూ.108 నుంచి రూ.230 దాకా చూపించిందని నిపుణులు గుర్తించారు. దాదాపు రెండు గంటల పాటు తక్కువ రేటుకే టికెట్లు జారీ అయ్యాయని సాంకేతిక నిపుణుల దర్యాప్తులో తేలింది. ఏదిఏమైనప్పటికి ఈ చౌక టికెట్లను బుక్ చేసుకున్న వారిని ఉద్దేశించి చైనా సదరన్ ఎయిర్‌లైన్స్ కంపెనీ కీలక ప్రకటన విడుదల చేసింది. ఆ టికెట్లను కొన్నవారు .. వాటిని యథాతథంగా వాడుకోవచ్చని స్పష్టం చేసింది. టెక్నికల్ ప్రాబ్లమ్ వల్ల అలా జరిగిందని పేర్కొంది. దీంతో చౌకగా ఆ టికెట్లను తీసుకున్న వారి ఆనందానికి అవధులు(Plane Ticket – Rs 108) లేకుండాపోయాయి.