Missing Minister Removed : చైనా విదేశాంగ మంత్రి క్విన్ గ్యాంగ్ (Qin Gang) గత నెల రోజులుగా మీడియా ముందు కనిపించడం లేదు.
ఈ తరుణంలో చైనా కీలక ప్రకటన చేసింది.
ఆయనను విదేశాంగ మంత్రి పదవి నుంచి తొలగిస్తున్నట్లు వెల్లడించింది.
అయితే ఎందుకు క్విన్ గ్యాంగ్ ను తొలగించారనే కారణాన్ని చెప్పలేదు.
దీంతో ఏడు నెలల క్రితమే చేపట్టిన విదేశాంగ మంత్రి పదవిని 57 ఏళ్ల క్విన్ గ్యాంగ్(Missing Minister Removed) కోల్పోయారు.
చైనా నూతన విదేశాంగ మంత్రిగా కమ్యూనిస్ట్ పార్టీ విదేశీ వ్యవహారాల చీఫ్ వాంగ్ యి నియమితులయ్యారు. వాంగ్ యిని కొత్త విదేశాంగ మంత్రిగా నియమించేందుకు చైనా అత్యున్నత శాసనసభ ఓటు వేసింది. ఈ తీర్మానాన్ని ఆమోదించే డిక్రీపై చైనా అధ్యక్షుడు షి జిన్ పింగ్ సంతకం చేసినట్లు తెలిసింది. ఇక చైనా సెంట్రల్ బ్యాంక్ చీఫ్ పోస్టులో ఆర్థికవేత్త పాన్ గోంగ్షెంగ్ను నియమించాలని నిర్ణయించారు.
Also read : Vastu tips: ఇంటి మెయిన్ డోర్ వద్ద ఈ 5 మొక్కలు ఉంచితే చాలు.. ఐశ్వర్యం, సంపద మీ వెంటే?
క్విన్ గ్యాంగ్ .. ఇల్లీగల్ ఎఫైర్ ?
హాంకాంగ్‌కు చెందిన టీవీ జర్నలిస్ట్ ఫు జియోటియన్తో చైనా విదేశాంగ మంత్రి 57 ఏళ్ళ క్విన్ గ్యాంగ్ కు ఉన్న ఇల్లీగల్ ఎఫైర్ వ్యవహారంతో ఈ మిస్సింగ్ కు ముడిపెడుతూ కొన్ని సంచలన న్యూస్ స్టోరీస్ పబ్లిష్ అయ్యాయి. వాటి ప్రకారం.. హాంకాంగ్ కేంద్రంగా పనిచేసే Phoenix TVలో జర్నలిస్టుగా ఫు జియోటియన్ పనిచేస్తోంది. ఆమెతో క్విన్ గ్యాంగ్ కు ఎఫైర్ ఉందని ఆ స్టోరీలో ప్రస్తావించారు. అమెరికా పౌరసత్వం కలిగిన ఫు జియోటియన్తో చైనా విదేశాంగ మంత్రి క్విన్ గ్యాంగ్ కు వివాహేతర సంతానం ఉన్నారనే విషయం చైనా ప్రభుత్వానికి తెలిసిందని వివాదాస్పద న్యూస్ స్టోరీస్ లో పేర్కొన్నారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన చైనా ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు విదేశాంగ మంత్రిని అదుపులోకి తీసుకున్నాయని ఆ కథనాల్లో తెలిపారు. అయితే ఈ వార్తలను చైనా ప్రభుత్వం కానీ.. చైనా విదేశాంగ మంత్రి క్విన్ గ్యాంగ్ కానీ ఇంకా ధృవీకరించలేదు లేదా ఖండించలేదు. ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారని చైనా ప్రకటించిన విషయం కూడా నిజమై ఉండొచ్చు. ఒకవేళ ఇంకొన్ని వారాలైనా క్విన్ గ్యాంగ్ మీడియా ముందుకు రాకుంటే.. ఈ సస్పెన్స్ మరింత పెరిగే ఛాన్స్ ఉంది. చైనా మంత్రులు అకస్మాత్తుగా అదృశ్యం కావడం ఇదే మొదటిసారేం కాదు. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయి. అవినీతి, కుంభకోణాలు వంటి కారణాలతో చాలామంది మంత్రులను సడెన్ గా చైనా ప్రభుత్వం జైల్లో వేసింది.
Also read : Unhealthy Gut: జీర్ణసమస్యలు తరచూ వేదిస్తున్నాయా.. అయితే మీకు ఆ సమస్య ఉన్నట్లే?