Site icon HashtagU Telugu

Driving In River : నదిలో జీపు డ్రైవింగ్.. ఎందుకిలా చేశారంటే ?

Driving In River

Driving In River

Driving In River : వరుస సెలవులు ఉండటంతో  హిమాచల్‌ ప్రదేశ్‌‌కు టూరిస్టులు పోటెత్తుతున్నారు. దీంతో రాష్ట్రంలో చాలాచోట్ల భారీ ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడుతోంది. ఈక్రమంలో ట్రాఫిక్‌ను తప్పించుకునేందుకు ఓ వ్యక్తి తన థార్ జీపును ఏకంగా నదిలో నుంచి డ్రైవ్ చేశాడు. సోమవారం సాయంత్రం లహాల్‌ వ్యాలీలో ఉన్న చంద్రా నదిలో నుంచి థార్ జీపును డ్రైవ్ చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జీపును నదిలో నుంచి డ్రైవ్ చేసిన టైంలో.. చంద్రా నదిలో నీటి మట్టం తక్కువగా ఉంది. దీంతో పెనుప్రమాదం తప్పింది. ఒకవేళ నీటి ప్రవాహ వేగం ఎక్కువగా ఉండి ఉంటే జీపు కొట్టుకుపోయినా ఆశ్చర్యం ఉండేది కాదు. వైరల్ అయిన ఈ వీడియో(Driving In River) చివరకు పోలీసులకు చేరింది. దీంతో ఆ కారుపై పోలీసులు చలానా కూడా జారీ చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

పర్యాటకుల తాకిడి పెరగడంతో మనాలి, అటల్‌ టన్నెల్‌ మార్గంలో భారీగా వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ అయ్యింది. పొగమంచు వల్ల వాహనాల రాకపోకలు సాఫీగా జరిగే పరిస్థితి లేకుండాపోయింది. దీంతో వాహనదారులు గంటల తరబడి ట్రాఫిక్‌లో కిలోమీటర్ల మేర ఇరుక్కుపోయారు. దీనికి సంబంధించిన చాలా వీడియోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. గత మూడు రోజుల్లో హిమాచల్‌ప్రదేశ్‌లోని అటల్‌ టన్నెల్‌ రూట్‌లో 56వేల వాహనాలు జర్నీ చేశాయని అధికారులు వెల్లడించారు. కొత్త సంవత్సరం వేడుకల కోసం ఈ వారంలో లక్షకు పైగా వాహనాలు సిమ్లాకు వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు.

Also Read: Guntur Jobs : గుంటూరు ఆస్పత్రుల్లో 94 జాబ్స్.. యాదాద్రి జిల్లాలో యువతకు ఉచితంగా సాంకేతిక శిక్షణ