Site icon HashtagU Telugu

Bank Holidays in October 2023 : అక్టోబర్ నెలలో ఏకంగా 16 రోజులు బ్యాంకులకు సెలవులు..

Bank Holidays In October 2023

Bank Holidays In October 2023

నెల మారుతుందంటే సామాన్య ప్రజల్లోనే కాదు బ్యాంకు ఖాతాదారుల్లో (Bank Customers) కొత్త టెన్షన్. సామాన్య ప్రజలు గ్యాస్ ధర (Gas Price) ఎంత పెరుగుతుందో అని..వంట సామాన్ల ధరలు ఎలా ఉండబోతున్నాయో అని , పెట్రోల్ ధరలు (Petrol Price) తగ్గుతాయా..పెరుగుతాయా..అని ఎదురుచూస్తుంటారు. ఇక బ్యాంకు ఖాతాదారులు కొత్తగా ఏ రూల్స్ వచ్చాయో..వస్తాయో..బ్యాంకు టైమింగ్స్ ఎలా ఉండబోతున్నాయి..ఎన్ని రోజులు బ్యాంకులకు సెలవులు ఉండబోతున్నాయి..అనేది చూస్తుంటారు.

ప్రస్తుతం మరో ఐదు రోజులైతే అక్టోబర్ (October 2023) నెల రాబోతుంది. సో బ్యాంకు ఖాతాదారులంతా అక్టోబర్ నెలలో ఎన్ని రోజులు బ్యాంకులు పనిచేయబోతున్నాయి..ఎన్ని రోజులు సెలవులు ఉండబోతున్నాయి..అనేది తెలుసుకునే పనిలో పడ్డారు.

అక్టోబర్​ నెలలో గాంధీ జయంతి, దసరా వంటి ముఖ్య పండుగలు రాబోతున్నాయి. వీటితో పాటు మరికొన్ని ప్రత్యేక దినాల్లో కూడా సెలవులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అక్టోబర్ నెలలో దాదాపు 16 రోజులపాటు బ్యాంక్ సెలవులు ఉండబోతున్నట్లు రిజర్వ్​ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్​బీఐ) తెలిపింది.

అక్టోబర్ 01 (ఆదివారం)
అక్టోబర్ 2 (సోమవారం) : మహాత్మా గాంధీ జయంతి
అక్టోబర్​ 12 (ఆదివారం) : నరక చతుర్ధశి (పలు రాష్ట్రాల్లోని బ్యాంకులకు సెలవు)
అక్టోబర్ 14 (రెండో శనివారం) : మహాలయ (కర్ణాటక, ఒడిశా, త్రిపుర, బంగాల్)
అక్టోబర్ 15 (ఆదివారం) : మహారాజ అగ్రసేన్​ జయంతి (పంజాబ్​, హరియాణ, ఉత్తరప్రదేశ్​, రాజస్థాన్​)
అక్టోబర్​ 18 (బుధవారం) : కతి బిహు (అసోం)
అక్టోబర్ 19 (గురువారం) : సంవత్సరి పండుగ (గుజరాత్​)
అక్టోబర్​ 21 (శనివారం) : దుర్గా పూజ (మహా సప్తమి)
అక్టోబర్ 22 (ఆదివారం) : మహా అష్టమి (పలు రాష్ట్రాలు)
అక్టోబర్​ 23 (సోమవారం) : మహానవమి/ ఆయుధ పూజ
అక్టోబర్ 24 (మంగళవారం) : దసరా/ విజయదశమి/ దుర్గాపూజ
అక్టోబర్​ 25, 26, 27 : కొన్ని ఇతర రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో అక్టోబర్​ 25, 26, 27 తేదీల్లో దుర్గా పూజ/ విజయ దశమి జరుపుకుంటారు. కనుక ఈ తేదీల్లో ఆయా రాష్ట్రాల్లోని బ్యాంకులకు సెలవులు ఉంటాయి.
అక్టోబర్​ 28 (నాల్గో శనివారం) : లక్ష్మీ పూజ, ప్రగత్ దివస్​
అక్టోబర్ 31 (మంగళవారం) : సర్దార్ వల్లభ్​ బాయి పటేల్​ జయంతి

Read Also : Angallu Case : చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై తీర్పును రిజర్వ్ చేసిన హైకోర్టు